ఆన్ లైన్ అమ్మకం & ప్రకటనలు నిషేదం..

DRK Raju
భారతప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్ట్రికల్ సిగరెట్స్ వాటి భాగాల ఉత్పత్తి, తయారి, దిగుమతి ,ఎగుమతి , రవాణా, అమ్మకం ,నిల్వలను నిషేధించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  డీజీపీ గౌతం సవాంగ్  అన్నారు. ఈ  నిషేదాన్ని అతిక్రమించినవారికి ఏడాది జైలు శిక్ష లేదా రెండు లక్షల జరిమానా విధిస్తామన్నారు. పునారావృత నేరానికి మూడేళ్లు జైలు శిక్ష , ఐదు లక్షల జరిమానా వేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ సిగిరెట్లు నిల్వచేస్తే ఆరు నెలలు జైలు శిక్ష, యాబైవేలు జరిమానా ఉంటుందన్నారు.



1940 డ్రగ్ కాస్మొటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన ఉత్పత్తులు మినహా.. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్, హీట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, ఇ - హుక్కా ఇలా ఏ ఆకారం , పరిమాణం, రూపంలో ఉన్నా ఎలక్ట్రానిక్ సిగిరెట్లుగా పరిగణింపబడతాయన్నారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులు మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం హిట్ నాట్  బర్న్ ప్రొడక్ట్స్, ఇ హుక్కా వంటివి నిషేదమని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు మరియు వాటి భాగాల యొక్క ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ నిల్వ, మరియు ప్రకటనలు నిషేదించబడ్డాయని డిజిపి తెలిపారు.



ఎలక్ట్రానిక్ సిగరెట్లు అమ్మకాలు జరిపితే సంవత్సరం జైలు శిక్ష లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా వేస్తామన్నారు. అదే విధంగా  ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు.  పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా నా ఈ సిగరెట్లు కానీ ఇ హుక్కా కానీ అమ్మకాలు జరిగితే ప్రజలు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని గౌతమ్ సవాంగ్ కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: