నిద్ర తక్కువైతే ఏం జరుగుతుందో తెలుసా...?

Reddy P Rajasekhar
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కడుపు నిండా తిండి మరియు కంటి నిండా నిద్ర ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువైనా మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. కానీ ఈరోజుల్లో నిద్రలేమి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ సైకాలజీ నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం ఈ వ్యాధితో బాధ పడే వారి సంఖ్య లక్షల్లో ఉందని తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఉండేవారు అధికంగా ఈ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 
 
నగరాల్లో నివసించే వారిలో ప్రతి పది మందిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. నిద్ర తక్కువ కావటం వలన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేమి ఉన్నవారిలో అనేక రకాలైన వ్యాధులు ఉన్నట్లు తెలిసింది. తక్కువగా నిద్రపోవటం వలన గుండె నొప్పి, స్ట్రోక్, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 
డయాబెటిస్, రక్త పోటు వంటి సమస్యలు కూడా తక్కువగా నిద్రపోవటం వలన వచ్చే అవకాశం ఉంది. తగినంత నిద్ర లేకపోవటంతో గుండె సమస్యలు ఏర్పడి మరణించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ సమస్యతో బాధ పడేవారిలో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన  కనిపిస్తాయి. నిద్రలేమి సమస్య వలన జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. నిద్రలేమి సమస్య కారణంగా బరువు కూడా పెరుగుతారు. 
 
తగినంత నిద్ర లేనివారిలో ఆలోచించే శక్తి సామర్థ్యాలు కూడా తగ్గుతాయి. నిద్రలేమి సమస్యలు ఉన్నవారిలో సమస్యలను పరిష్కరించే శక్తి కూడా తగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో నడుము భాగంలో కొవ్వు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం రోజుకు ఏడు గంటల సమయం పాటు నిద్ర పోవాలి. ఏడు గంటల సమయం కన్నా నిద్ర తక్కువైతే శరీరంపై నల్ల చారలు, ముడతలు, వృద్ధాప్యం త్వరగా వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: