ఫోటో తీస్తున్నాడని.. కెమెరామెన్ ను అక్కడ కుమ్మేసింది.. !!

Balachander
ఫొటోగ్రఫీ చాలామందికి ఇష్టమైన వ్యాపకం.. కొంతమంది అదే ఉపాధి.. మరికొంతమంది దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని ఆ రంగంలో రాణిస్తుంటారు.  ఎంతో ఎత్తుకు ఎదుగుతుంటారు.  ఫోటోగ్రఫీలో చాలా రకాలు ఉంటాయి.  ఇందులో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ చాలా బాగుంటుంది.  క్రియేటివిటీకి స్కోప్ ఉంటుంది.  కొత్తగా ఆలోచిస్తూ సరికొత్తగా ఫోటోలు తీస్తూ మోడల్స్ ను అందంగా చూపిస్తే చాలు కోట్లాది రూపాయలు సొంతం చేసుకోవచ్చు.  ఇలాంటి వాళ్లకు సృజనాత్మకత చాలా అవసరం.  ఇలాంటివాళ్ళు చాలా రేర్ గా ఉంటారు.  


సినిమా రంగంలో ఫొటోగ్రఫీ వేరు.  ఇక్కడ రాణించేవాళ్లకు డబ్బుతో పాటు పేరు కూడా వస్తుంది.  అయితే, ఇక్కడ ఇంకో రంగం కూడా ఉన్నది.. అదే వైల్డ్ ఫోటోగ్రఫి.  ఇది చాలా కష్టంతో కూడుకున్నది.  ప్రతి ఒక్కరికి వైల్డ్ అడ్వెంచర్స్ అంటే ఇష్టపడతారు.  కానీ, గ్రౌండ్ లో దిగేసరికి మనసు మార్చుకొని వెళ్లిపోతుంటారు.  అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్స్ కు మంచి లైఫ్ ఉంటుంది.  రిస్క్ ఎక్కువ.. ప్రాణాలతో చెలగాటం కూడా.  


ఎందుకంటే కొన్నిసార్లు పులులు, సింహల ఫోటోలు తీయవలసి వస్తుంది. ఫొటోగ్రఫీతో పాటు యానిమల్ సైకాలజీ కూడా తెలిసి ఉండాలి.  వాటి మూడ్ కు అనుగుణంగా ఫోటోలు తీయాలి.  లేదంటే అవి దాడి చేస్తుంటాయి.  ఇంగ్లాండ్ లోని వైల్డ్ షైర్ జంతువుల పార్క్ లో సఫారీ పార్కుల్లో దాగున్న వన్యప్రాణుల జీవితంలోని దృశ్యాల ఆవిష్కరణ అనే పేరుతో బిబిసి ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.  దానికోసం బిబిసి వైల్ట్ అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేందుకు వెళ్లారు.  


అక్కడికి ఓ గొర్రె వచ్చింది.  ఆ గొర్రె చాలా పొగరుబోతు అని.. దానికి నచ్చని పని చేస్తే ఎవరిమీదైనా సరే తిరగబడుతుందని  ఆ పార్క్ అధికారులు తెలిపారు.  ఆ గొర్రె పేరు సిసిల్ అని చెప్పి దాన్ని కెమెరామెన్ కు పరిచయం చేశారు.  సిసిల్ కెమెరామెన్ దగ్గరకు వచ్చింది.  దగ్గరకు రావడం చూసి.. ఆ గొర్రెను తన కెమెరాలో బంధించేందుకు రెడీ అయ్యాడు. తనను వీడియో తీయడం దానికి నచ్చలేదు.  మోకాళ్లపై కూర్చొని కెమెరా సెట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ దగ్గరకు వచ్చి నిలబడింది.  ఓ రెండు సెకన్లు అలా నిలబడి.. తన తలతో కెమెరామెన్ రెండు తొడల మధ్యలో బలంగా కుమ్మింది.  అంతే.. ఆ దెబ్బకు కెమెరామెన్ కిందపడి లబోదిబో అన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: