ప్రభుత్వాలు మారుతున్నా కరకట్టడాలు పూర్తికాలేదు

SEEKOTI TRIMURTHULU
- మత్స్యకారులకు ఏటా తప్పని కష్టాలు
వర్షాకాలం వస్తే చాలు వంశధార, నాగవల్లి ప్రజలు ఎప్పుడు ఏ అర్ధరాత్రి వరదలె పొంగుకు  వస్తాయో అని పరివాహక ప్రాంతాల ప్రజలు హడలెత్తుపోతుంటారు. వరద ప్రవాహాం అరలక్ష క్యూసెక్కులు దాటితే చాలు గట్లు ఎక్కడ కట్టలు తెంచుకుంటాయోనని భయపడుతుంటారు. ఏటా వరదలతో గట్లు బలహీనంగా ఉన్నచోట్ల పంటపొలాలు, నివాసాలను ముంచెత్తుతూనే ఉన్నాయి. 


ఈ ప్రమాదం దృష్ట్యా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ రెండు నదుల గట్లు కట్టుదిట్టం చేయాలని సంకల్పించారు. ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాల అలసత్వం కారణంగా కారకట్టల పనులు మందగమనంలోకి వెళ్లిపోయాయి. వాటిని పూర్తీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. వంశధార నది కరకట్టల నిర్మాణ పనులను మూడు ప్యాకేజిలగా విభజించి గత ఏడాది టెండర్లను ఆహ్వానించారు. 


ప్యాకేజి-1లో బావిని మండలంలో బత్తిలి నుంచి కీసరగ్రామం వరకు, కొత్తూరు మండలంలో సిరుసువాడ నుంచి ఆకులతంపరం వరకు నది కుడివైపు గట్టు, అలాగే కొత్తూరు మండలం కడుము  నుంచి పొన్నుతూరు వరకు ఎడమవైపు  గట్టు కరకట్టల పనుల కోసం రూ.238.66కోట్ల టెండర్లకు పిలిచారు. ఈ పనులను శ్రీలక్ష్మి కంస్ర్టక్షన్స్ కంపెనీ దక్కించుకుంది.


ప్యాకేజ్-2లో హిరమండలంలో రగడ నుంచి జలుమూరు మండలంలో కరకవలస గ్రామం వరకు ఎడమవైపు గట్టు, హిరమండలంలోని గులుమూరు నుంచి LN పేట మండలంలోని స్కాటిపేట వరకు కుడివైపు గట్టు కరకట్టల నిర్మాణానికి రూ.143 కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానంచారు. ఈ పనులను  SR కంస్ర్టక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. ప్యాకేజ్-3  కింద LN పేట మండలంలోని స్కాటిపేట నుంచి గారమండలం కళింగపట్నం వరకు రూ.213 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు.


ఈ పనులను ఇన్ఫ్రా ప్రొజెక్టర్ సంస్థ దక్కించుకుంది. అయితే పాత కాంట్రాక్టర్ సంస్థతో నెలకొన్న న్యాయవివాదం పరిష్కారం కాలేకపోవడంతో  ప్యాకేజ్-3  పనులు ప్రారంభించనేలేదు. మిగతా రెండు ప్యాకేజ్ పనులు కూడా తూతూమంత్రంగానే  జరిగాయి. ఇప్పటివరకు ప్యాకేజ్-1 లో 8.45 శాతం , ప్యాకే-2 లో 5.66 శాతం పనులు మాత్రమే జరిగాయని మత్స్యకారులు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: