యూనివర్శిటీల్లో తగ్గుతున్న విద్యార్థుల అడ్మిషన్లు

PHANEENDRA J
ఈ ఏడాది ఢిల్లీ యూనివర్సిటీ‌లో విద్యార్థుల అడ్మిష‌న్లు త‌గ్గుముఖం పట్టాయి. ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలు కూడా చెబుతున్నారు యూనివర్సిటీ సిబ్బంది. యూనివర్సిటీ ప‌రిధిలోని ప‌లు కాలేజీల ద‌గ్గ‌ర హుక్కా సెంట‌ర్లు, మ‌ద్యం దుకాణాలు, డ్ర‌గ్స్, వ్య‌భిచార కేంద్రాలు ఉన్నాయ‌నీ, అందుకే చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను యూనివర్సిటీ కాలేజీల్లో చేర్చేందుకు ఇష్ట ప‌డ‌టం లేద‌ని అంటున్నారు.

ప్ర‌ధానంగా యూనివర్సిటీ నార్త్, సౌత్ బ్లాక్ ఏరియాల్లో హుక్కా సెంట‌ర్లు, లిక్క‌ర్ కేఫ్‌లు విప‌రీతంగా ఉన్నాయ‌ట‌. బ‌య‌ట‌కు చిన్నాపాటి కేఫ్ పేరుతో బోర్డులు పెడుతున్న వ్యాపారులు, లోప‌ల మాత్రం మ‌ద్యం స‌ర‌ఫ‌రా, హుక్కా సెంట‌ర్లు న‌డుపుతున్నార‌ట‌. ఈ విధంగా దాదాపు 80 లిక్క‌ర్ కేఫులు, హుక్కా సెంట‌ర్లు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని యూనివర్సిటీ సిబ్బంది పేర్కొంటున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట దాకా న‌డిచే ఈ వ్యాపారాల‌తో స్థానికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నట్లు చెబుతున్నారు.

ఈ ఇల్లీగ‌ల్ వ్యాపారాల మీద పోలీసుల‌కు ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా, తూతూ మంత్రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఢిల్లీ యూనివర్సిటీ ఏబీవీపీ కార్య‌ద‌ర్శి సిద్ధార్ద్ యాద‌వ్ ఆరోపిస్తున్నారు. ప్ర‌ధానంగా యూనివర్సిటీ సౌత్ బ్లాక్ ప‌రిధిలో ఉన్న స‌త్య నికేత‌న్ కాలేజి గేటు ఎదురుగా ప‌లు లిక్క‌ర్ కేఫులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. 2017లో ఢిల్లీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంట‌ర్ల‌ను నిషేధించింది. అయినా కొంద‌రు పోలీసుల సాయంతో ఇవి న‌డుపిస్తున్నట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: