పరిటాల కుటుంబానికి భద్రతను పెంచి శెభాష్ అనిపించుకున్న జగన్ ..!

Prathap Kaluva

జగన్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే తన మార్క్ పరిపాలనను రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రత మీద మాజీ మంత్రి సునీత ఆందోళన వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.వీటి ప్రకారం ఇప్పుడున్న గన్ మెన్ల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది మంది అదనపు గన్ మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ కావటానికి ముందు పరిటాల సునీత.. ఆమె కుమారుడు శ్రీరాములు అనంతపురం జిల్లాలోని తమ స్వగ్రామమైన వెంకటాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబ భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేశారు.కొత్త ప్రభుత్వంలో ఏర్పడే పరిస్థితుల మీద వారు ఆందోళన వ్యక్తం చేశారు.


అదే సమయంలో టీడీపీ నేతలు.. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు మామూలేనని.. అంత మాత్రానికే అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని.. అలాంటి వాటి విషయంలో సంయమనంతో వ్యవహరించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: