జగన్ తో ఫోటో దిగితే చాలనుకున్నాడు.. జగన్ ఎంపీని చేసేశాడు..

Chakravarthi Kalyan
ఆయనో మామూలు కూలీ.. అంగబలం, అర్థబలం లేదు.. కూలీ దొరకని రోజుల్లో ఫోటోలు తీసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకునేవాడు. అలాగే ఆయనకు వైఎస్ అన్నా.. జగన్ అన్నా వల్లమాలిన అభిమానం.. ఎప్పటికైనా జగన్ తో ఫోటో దిగాలన్నది అతని కోరిక.. 


కానీ ఇప్పుడు అదే వ్యక్తి జగన్ పార్టీలో ఎంపీ అయ్యారు. అంతే కాదు.. జగన్ కు ఆప్తుడిగా మారారు. జగన్ వెంట ప్రధాని మోదీని కలిసేందుకు కూడా వెళ్లారు. ఆయనే బాపట్ల ఎంపీ నందిగం సురేశ్. ఇదీ జగన్ ట్రీట్ మెంట్.. మరి ఇంతగా జగన్ కు నందిగం సురేశ్ లో నచ్చిందేమిటి.. ఎందుకు ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చారు. 

ఎందుకంటే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాజధాని భూములలో చెరుకు తోటలు కొందరు తగులపెట్టారు. అలా చేియంచింది జగన్ అని చెప్పాలంటూ ఆ ప్రాంతంలో కూలీ అయిన నందిగం సురేశ్ పై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెరవెనుక ఉండి ఒత్తిడి చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 

చిట్టెం కోటేశ్వరరావు అనే సిఐ తనను చిత్రహింసలుపెట్టారని, నోట్లో తుపాకి పెట్టి చంపుతానని బెదిరించారని, ఆ తర్వాత తాళ్లతో కట్టి రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారని సురేశ్ గుర్తు చేసుకున్నారు.  తాను అబద్దం చెప్పబోనని స్పష్టం చేశానని అన్నారు. తనను నిర్భందించిన విషయం వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలకు కూడా తెలియడంతో పోలీసులు వదలిపెట్టారట. 

ఈ విషయం జగన్ వరకూ వెళ్లిందట.  ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారట. సురేశ్ ధైర్యానికి మెచ్చి పార్టీలో క్రియాశీల స్థానం అప్పగించారు. ఆ తరవాత బాపట్ల టికెట్ ఇచ్చారు. తాను కూలీగా ,పోటోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తినని, జగన్ వెనుక ఎప్పుడైనా పోటో లో ఉంటే చాలని ఆశించానని సురేశ్ అంటున్నారు. కానీ జగన్ తనను ఏకంగా ఎంపీని చేశారని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: