జగన్ కి షాకింగ్ సవాలు విసిరిన మంత్రి పరిటాల సునీత..!

KSK
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ కి సవాల్ విసిరారు. ఇటీవల జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై అలాగే వక్ర రుణాలపై చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పరిటాల సునీత.


జగన్ చేస్తున్న కామెంట్లపై తనతో డిబేట్ కి కూర్చోవాలని చాలెంజ్ విసిరారు. ఎక్కడైనా ఎప్పుడైనా డోక్రా మహిళల చేయూత పై డిబేట్ కు నేను సిద్ధమని షాకింగ్ కామెంట్లు చేశారు మంత్రి పరిటాల సునీత.


ఏపీ పాలిట జగన్ మహిషాసురుడని, కోటి మంది డ్వాక్రా మహిళలను జగన్ అవమానించారని ఆమె విమర్శించారు. పసుపు-కుంకుమ పథకాన్ని హేళన చేయడం జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 10రోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలల్లోకి పసుపు-కుంకుమ తుది విడత నిధులను మంజూరు చేస్తున్నామని సునీత తెలిపారు. 2019 ఎన్నికల్లో జగనాసురుడిని మర్దించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.


కష్టపడి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించాలని కుంటుంటే ప్రతిపక్ష నేత జగన్ అధికార దాహం కోసం అన్ని విధాల అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సునీత. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సునీత.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: