పరిటాల శ్రీరామ్ ని వదలొద్దు హైకోర్ట్ సంచలన తీర్పు..!

KSK
అనంతపురం జిల్లా రాజకీయాలలో పరిటాల కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పరిటాల సునీత విధులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. నేపథ్యంలో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ విషయంలో ఇటీవల హైకోర్టు సంచలన కామెంట్ చేసింది. పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...  వైసీపీ నేత నారాయణపై పరిటాల శ్రీరామ్, అతని సన్నిహితులు గతంలో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. అతనిచేత బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుున్నారని బాధితుడు ఆరోపించారు.


దీంతో తమపై దాడి చేసిన పరిటాల శ్రీరామ్ పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అందుకు పోలీసులు నిరాకరించారు. ఈ పరిణామంతో నారాయణ తన ఫిర్యాదును పోస్టు ద్వారా ఎస్పీకి పంపారు. అయినా కానీ పోలీస్ వ్యవస్థ పరిటాల శ్రీరామ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు. కేసు విషయంలో పోలీసులు చాలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: