మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు..లైన్ క్లీయర్?!

siri Madhukar
తమిళ ఆరాద్య దైవం డీఎంకే అధినేత కరుణానిధి నిన్న సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో కావేరీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.  అయితే ఆయన అంత్యక్రియలు మెరీనా బీచ్ లో జరగాలని బలమైన కోరిక..కానీ తమిళనాడు ప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలపడంతో నిన్న రాత్రి నుంచి ఉత్కంఠత నెలకొంది.  తాజాగా కోట్లాది మంది డీఎంకే కార్యకర్తలు, అభిమానుల కల నెరవేరనుంది. తమ ప్రియనేత అంత్యక్రియలను మెరీనా బీచ్ లో చేయాలన్న వారి కోరిక తీరనుంది. కొద్దిసేపటి క్రితం మద్రాస్ హైకోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.


బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది. ఇతర తమిళ నాయకుల వల్లే కరుణానిధిని కూడా మెరీనా బీచ్ లోనే అంత్యక్రియలు చేయాలని కరుణానిధి కుటుంబ సభ్యులు భావించగా ప్రభుత్వం మాత్రం అక్కడ స్థలం ఇవ్వలేమని ప్రకటించారు అయితే డిఎంకె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది.హైకోర్టు చీఫ్ జస్టిస్ పిటిషన్ లు అన్నింటిని పరిశీలించి అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేశారు.


 గతంలో మెరీనాలో స్మారక స్తూపాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ రామస్వామి తో సహా పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. మొత్తం ఈ అంశంపై ఉన్న ఐదు పిటిషన్లను ఇవాళ హైకోర్టు జస్టిస్ కొట్టివేశారు.  కాకపోతే దీనిపై మాత్రం తుది తీర్పు ఇవ్వలేదు. అయినప్పటికీ, పిటిషన్ లు కొట్టి వేయడం తో మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు చేయడానికి మార్గం సుగమం అయ్యింది.   


ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై వాదనలు సాగుతుండగా, కాసేపట్లో కోర్టు తుది తీర్పు వెలువడనుంది. కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతంలో ఇదే విషయాన్ని మైకుల ద్వారా కార్యకర్తలకు చెప్పడంతో వారిలో ఆనందం పెల్లుబికింది. ఇక విద్యా సంస్థలు సినిమాహాళ్లు ఇంకా ఇతర సంస్థలు ఇవాళ స్వచ్ఛందంగా మూసివేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: