కరుణానిధి అంత్యక్రియలపై హైడ్రామా..హై టెన్షన్!

Edari Rama Krishna
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియల విషయంలో హైడ్రామా నడిచింది.  కరుణానిధి అంత్యక్రియలను చెన్నై మెరీనా బీచ్ లో జరిపేందుకు పలు కారణాలు అడ్డుగా ఉన్నాయని పళనిస్వామి ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది.

ఇత‌ర నేతల అంత‌క్రియ‌ల‌కు స్థ‌లం ఇచ్చిన‌ట్లుగానే సీనియ‌ర్ నేత క‌రుణానిధికి ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది.  డీఎంకేను స్థాపించిన అన్నాదురై ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కరుణానిధియే తనకు ఆత్మ, అంత అని చెప్పారని, గాంధీ మండపానికి సమీపంలో ఆయనకు చోటు సరికాదని డీఎంకే లాయర్ వాదించారు. 

మరోవైపు మెరినా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. స్వయంగా కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు నాటీ దివంగత నేత జానకీ రామచంద్రన్‌కు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వలేదని ప్రభుత్వం తరఫు లాయర్ తెలిపారు. 

మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియల అంశంలో హైకోర్టులో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు విచారణ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి విచారణ చేపట్టారు. అనంతరం ఉదయానికి వాయిదా వేశారు. మంగళవారం అర్ధరాత్రి కరుణానిధి పార్థివదేహాన్ని గోపాలపురం నుంచి రాజాజీ హాలుకు తరలించారు. 

మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ నివాసానికి వెళ్లి అత్యవసర పిటిషన్‌ దాఖలుకు అనుమతి కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ ఏజీకి నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.  మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా స్పందించారు.  తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం మంచిదికాదని.. మరణం తర్వాతైనా కరుణానిధికి సరైన స్థానం ఇవ్వాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: