అన్నా క్యాంటీన్ లో పనిచేసే పిల్లాడికి షాక్ ఇచ్చిన మంత్రి సునీత..!

KSK
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల మన్నలను పొందడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇటీవల పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర పరువుని తీసేశారు చంద్రబాబు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది కోడానికి ఈమధ్య చంద్రబాబు అన్నా క్యాంటీన్లు అంటూ హడావిడి చేసిన విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో బైపాస్ రోడ్డు ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని మంత్రి పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు.


అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు. ఆపై “ఏరా… బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా రేయ్ ” అంటూ వార్నింగ్ ఇచ్చారు.


చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. అంతేకాకుండా మంత్రి సునీత స్వయంగా రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని ప్రజలతో భోజనం చేశారు. ఈ సన్నివేశం చూసిన అక్కడ ప్రజలు ఎంతగానో సంతోషించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: