ఆయన శవాన్ని చూసి కళ్లుతిరిగి పడిపోయిన పరిటాల సునీత..

Prathap Kaluva
దివంగత నేత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్‌‌ చమన్ సాబ్ నేడు సోమవారం రోజున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న అసుపత్రికి తరలించాగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.


పరిటాల సునీత కుమార్తె స్నేహలత పెళ్ళి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి గత మూడు రోజులుగా ఆయన పెళ్లివేడుక జరిగే వెంకటాపురం గ్రామంలోనే ఉండడం జరిగింది. మే 6 న పెళ్లివేడుక ఘనంగా నిర్వహించిన మరుసటి రోజే ఆయనకు గుండెపోటు వచ్చి ఇలాంటి విషాద సంఘటన జరగడం పరిటాల కుటుంబసభ్యులను విషాదంలోకి నెట్టివేసింది.


ఆయన అస్వస్థత పాలయ్యాడు అని తెలుసుకొన్న మంత్రి సునీత ఆయనున్న హాస్పిటల్ కు హుటాహుటిన చేరుకున్నారు. అక్కడ ఆయన మృతదేహాన్ని చూసి మంత్రి సునీత కళ్ళుతిరిగి పడిపోయారు. దీంతో అక్కడున్న డాక్టర్లు వెంటనే ఆమెకు ప్రథమ చికిత్సను అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: