వై.సి.పి అభిమానులకు జోష్ నింపే వార్త

KSK

జగన్ అభిమానులకు జోష్ నింపే వార్త ఊహించిందే జరుగుతుంది. జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిజం లేదని తేలిపోతుంది. జగన్ పై నమోదైన కేసులలో నాటి ప్రభుత్వం లో కీలక  అధికారులపైన అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే అనేక మంది అధికారులకు కేసుల నుండి న్యాయస్థానం ఉపశమనం కలిగించింది. తాజాగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుకు సంబంధించి అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి తప్పేమీ లేదని కోర్టు తేల్చిచెప్పింది.


సీబీఐ మోపిన అభియోగాలలో ఒక్క దానికి కూడా సాక్ష్యం చూపించడంలో విఫలమైందని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ తనపై రాజకీయ కక్ష సాధింపు లో భాగంగానే కేసులు నమోదయ్యాయని తొలి నుండి వాదిస్తున్నారు. జగన్ ని అక్రమంగా సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా 16 నెలలు జైల్లో పెట్టారని వైసిపి నాయకులతో పాటు రాష్ట్రంలో ఉండే జగన్ సన్నిహితులు చాలామంది వ్యాఖ్యానించారు.


అయితే జగన్ పై మోపిన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది అధికారులు పలు సందర్భాలలో వెల్లడించడం జరిగింది. జగన్ పై సీబీఐ వాదించిన క్విడ్ ప్రోకో కేసులలో నిజం లేదని న్యాయస్థానాలు తెలియజేస్తున్నాయి.


ఇప్పటికే జగన్ పై  నమోదైన చాలా కేసులలో సీబీఐ విచారణలో వారి పాత్రను నిరూపించడంలో విఫలం అయ్యారనే మాటలే వినిపించాయి. తాజాగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల విషయంలో జగన్ కూడా నిర్దోషి అని..తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతుంది. మొత్తం మీద అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జగన్ పై నమోదు చేసిన కేసులు కుట్రపూరిత కేసులని తేలిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: