పరిటాల ఇంట పెళ్లి సంద‌డి..అమ్మవారి పాదాల వద్ద లగ్నపత్రిక

Edari Rama Krishna
ఏపీ మంత్రి ప‌రిటాల సునీత ఇంట మ‌ళ్లీ పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ప‌రిటాల ర‌వి-సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ జ‌రిగిన ఆరునెల‌ల‌కు వారి ఇంట్లో మ‌ళ్లీ వివాహ సంద‌డి మొద‌లైంది. ప‌రిటాల దంప‌తుల కుమార్తె స్నేహ‌ల‌త నిశ్చితార్థం ఆమె మేన‌బావ హ‌ర్ష వ‌డ్ల‌మూడి మార్చి 29న జ‌రిగింది. ప‌రిటాల ర‌వి సోద‌రి అయిన శైల‌జ కుమారుడు హ‌ర్ష‌.

ప‌రిటాల కుటుంబ స‌భ్యుల స‌మాచారం ప్ర‌కారం శైల‌జ కుమారుడితో త‌న కూతురు వివాహం జ‌ర‌గాల‌ని ప‌రిటాల ర‌వి ఆకాంక్షించారు.  ప్రస్తుతం  స్నేహలత మెడిసన్ చేస్తున్నారు..తన విద్య పూర్తి అయిన తర్వాత  ప‌రిటాల కుటుంబం ఓ ఆస్ప‌త్రిని నిర్మించ‌నుంద‌ని, దాని బాధ్య‌త‌ల‌ను స్నేహ‌ల‌త చూసుకోనుంద‌ని స‌మాచారం. ప్రస్తుతం హ‌ర్ష వ్యాపార‌వేత్త‌గా కొనసాగుతున్నారు. 

తాజాగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. మే 6న కుమార్తె వివాహం సందర్భంగా మంత్రి పరిటాల సునీత పెళ్లిపత్రికను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్నికుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పరిటాల సునీత...ఈ సందర్భంగా కుటుంబంతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కుమార్తె వివాహానికి ఆహ్వానించిచారు మంత్రి పరిటాల సునీత.ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కుటుంబంతో సహా ఆయనను కలసి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పరిటాల సునీత తన కుమార్తె డా.పరిటాల స్నేహలత వివాహ ఆహ్వాన పత్రికను సిఎం చంద్రబాబుకు అందించి వివాహానికి ఆహ్వానించారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: