కర్ణాటకకు కొత్త జండా, కొత్త మతం - ఇప్పుడది సిద్ధరామయ్య కు బూమరాంగైంది?

"లింగాయత్" అనే ఒక హిందూ మత శాఖ పొరుగురాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల వేళ, వేడి రగిల్చింది. అయితే  హిందూ మతాన్ని కులాల కురుక్షేత్రం నుండి రక్షించటాని కే అవతరించిన ఈ శాఖ,  రాజకీయ రంగు పులుము కొని వేడి వేడి వార్తలతో రోజుకో రకంగా తెర మీదకు వస్తోంది. రెండ్రోజుల కితం ప్రత్యేక జెండాతో రాజకీయ యవనికపై దర్శన మిచ్చిన ఈ రాష్ట్రం తాజాగా కొత్త మతం పేరుతో మళ్లీ దేశం దృష్టిని తన వైపు తిప్పుకొంది.


కర్ణాటకలో రానున్న శాసనసభ ఎన్నికలకు ముందు ఒక వాడి వేడి చర్చను రగిల్చింది. తమకు ప్రత్యేక మతం లేదా "మైనార్టీ హోదా" ఇవ్వాలని ఎప్పటి నుంచో లింగాయత్లు లు డిమాండ్ చేస్తు న్నారు.


తాము హిందువులం కాదని, హిందూ మతంలో కులాలుంటాయని, తమ మతంలో కులాలు ఉండవని వాళ్లు వాదిస్తున్నారు. అలాగే రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న తమది బలమైన రాజకీయ వర్గమని తమకు మైనారిటీ హోదా కూడా  ఇవ్వాలని బలంగా కోరుతున్నారు. నాడు హిందూ మతాన్ని కులవాదం నుండి తప్పించి సంస్కరించటానికి, 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి అనుచరులే ఈ లింగాయత్లు.

Basaveswara founded Lingayat religion Any person of any social status, occupation,or caste can embrace Lingayatism. 

బసవేశ్వరుడు  బ్రాహ్మణుడు. హిందూమతంలోని కులవ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటంచేశారు. అందుకు ఆయన తన బ్రాహ్మణ కుల సాంప్రదాయాల నే వ్యతిరేకించారు. హిందూజాతిని కులం లేని మతం కావాలంటూ గా తీర్చిదిద్దే క్రమంలో లింగాయతు వ్యవస్థని తీర్చిదిద్దారు. అది హిందూమతం లోని శాఖగానే నాడాయన చెప్పారు.  వీళ్లు శివలింగాన్ని మాత్రమే పూజిస్తారు.


అలాంటి లింగాయత్ల కు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటును ప్రభావితం చేసే శక్తి ఉంది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి  సిద్దరామయ్య ఇప్పటికే లింగాయత్లను ఓ ప్రత్యేక మతంగా గుర్తించడం తోపాటు మైనార్టీ హోదా కూడా ఇస్తామని స్పష్టంచేశారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా మైనార్టీ హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీంతో ఆ రాష్ట్ర కేబినెట్ దీనిని ఆమోదించి - కేంద్రానికి పంపాలని భావిస్తున్నది.


ఇదంతా సిద్ధరామయ్య గారి కుటిల రాజకీయమని దేశ శ్రేయోభిలాషులు అంటున్నారు. కులాలు మతాలతో నలిగే దేశంలో అదనంగా అనవసరంగా మరో మైనారిటీ గా మారాలనుకుంటూ రాజకీయ అవసరాల కారణంగా కొత్తమతం ఉద్భవించబోతుంది. ఇక్కడ బీజేపీకి లింగాయత్లులు బలమైన శక్తిగా ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి  అభ్యర్థి యడ్యూరప్ప కూడా లింగాయతు వర్గానికి చెందిన వారే . దీంతో ఈ అంశంపై ఆ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.


మరోవైపు దానికి బాజపా మాతృసంస్థ  “ఆరెస్సెస్” మాత్రం లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించడాన్ని అంగీకరించబోమని స్పష్టంచేసింది. వీరు పూజించే శివుడు, శివలింగమూ హిందూ మత దైవాలేనని దాని భావన. అయితే  దానికి ఆరెస్సెస్ అనుమతి  అవసరం లేదంటూ లింగాయత్ నేతలు తిప్పికొట్టారు.


దీనిపై ఇటు బాజపా అటు కాంగ్రేస్ నిదానంగా ఆచితూచి స్పందిస్తున్నాయి. ఇదిలా ఉండగా, లింగాయతుల కొత్త మత సృష్టి ఉద్యమంలోనూ విభేదాలు పొడసూపాయి. ఒక వర్గం లింగాయ తులు కొత్త మతానికి "వీరశైవ లింగాయతులు" అని నామకరణం చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. వారి మరో వర్గం మాత్రం కేవలం "లింగాయత్" అని మాత్రమే గౌరవించాలని అంటు న్నారు. "వీరశైవం-హిందూ వేద సాంప్రదాయాలను అనుసరిస్తుందని- "లింగాయతులు" హిందూ మత సాంప్రదాయాలకు వ్యతిరేకమన్న వాదన ప్రచారంలో ఉంది.


అయితే అదిప్పుడు ఈ రాజకీయ సృష్టి కర్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య పైనే బూమరాంగై కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. తన స్వంత ప్రభుత్వం కూడా దీనిపై నిట్ట నిలువున రెండుగా చీలింది. మంత్రి ఎం.బీ పాటిల్ కేవలం లింగాయత్ అన్న పేరు మాత్రమే ఉండాలని అంటున్నారు. అనుభవఙ్జుడైన శాసనసభ్యుడు శామనూర్ శివశంకరప్ప మాత్రం "వీరశైవ లింగాయత్" గా పేరు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.


అయితే ఓట్ల కోసం, ఎన్నికల కోసం, తమ రాజకీయాల కోసం, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పనిగట్టుకొని మరీ తమకు తమ ఐఖ్యతకు ముప్పుతెస్తున్నారని బీజేపీ ముఖ్య మంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఆరోపిస్తున్నారు. లింగాయతులు అన్నా, వీరశైవులు అన్న ఒక్కటేనని వారిమద్య బేధం లేదని ఆయన స్పష్టంచేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: