ఆ వ్యాధి.. మీకు తెలియకుండానే మిమ్మల్ని మింగేసుంది.. జాగ్రత్త.. !?

Chakravarthi Kalyan
అదో మహమ్మారి.. ఆధునిక కాలంలో మనుషుల్ని నిర్దాక్ష్యణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వింత రోగం.. ఎందుకు వస్తుందో పక్కాగా కారణాలు దొరకవు. పోనీ రాకుండా ఏం చేయాలో కూడా అందరికీ తెలియదు. ఎంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఆ రోగం రాకుండా ఉండదు. ఇంతకూ ఏంటా వింత రోగం.. దాని గురించి తెలుసుకుందాం.. అవును మీరు ఊహిస్తున్నట్టు ఆ రోగం పేరు క్యాన్సర్.. 


అసలు క్యాన్సర్ అంటే ఏంటి.. దాని లక్షణాలు ఏంటి..ఎందుకొస్తుంది.. పరిశీలిద్దాం.. అసాధారాణ రీతిలో  శరీరంలో కణజాలాలు అడ్డూఅదుపూ లేకుండా వృద్ధి చెందడం వల్ల వచ్చేజబ్బే క్యాన్సర్.. ఈ వ్యాధి కారణంగా కణజాలాలన్నీ ఒక కణితిగా కానీ గడ్డగా ఏర్పడతాయి. మరి క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలో వస్తుంది.. అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇది అనేక భాగాల్లో వస్తుంది. 


వీటిలో ప్రధానమైనవి.. రొమ్ము క్యాన్సర్, గొంతు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఎముకల క్యాన్సర్.. ఇలా ఎన్నో ఉన్నాయి. మరి క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా.. అంటే దీనికి కచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సరును ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్లు ద్వారా ముందు జాగ్రత్త ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చును. 


ధూమపానం, నికోటిన్ సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. అలాగే క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఎండ వేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: