ఇలా ఐతే పారడైజ్ పేపర్లలో నాగ్, చిరులకు కూడా లింక్ ఉన్నట్లె: బుగ్గన

frame ఇలా ఐతే పారడైజ్ పేపర్లలో నాగ్, చిరులకు కూడా లింక్ ఉన్నట్లె: బుగ్గన

ప్యారడైజ్ పేపర్లలో జగన్మోహనరెడ్డి ప్రస్తావన ఉందని దానిపై సీబీఐ విచారణ జరగాలంటూ ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేసిన అంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడిపై,  వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్యారడైజ్ పేపర్‌ లో తన పేరు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పు కుంటానని జగన్మోహనరెడ్డి సవాల్ చేస్తే దాని గురించి మాట్లాడకుండా తిరిగి అబద్దాలు మాట్లాడడం ఏమిటని యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే జగన్మోహనరెడ్డి సవాల్‌ పై చంద్రబాబు స్పందించాలని కోరారు.
yanamala ramakrishnudu కోసం చిత్ర ఫలితం


కేవలం తెలుగు మీడియా అండ  ఉందన్న ఉద్దేశంతో రోజూ చెప్పిన అబద్దాన్నే పదే పదే చెప్పడం సిగ్గుగా అనిపించడం లేదా?  అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో కొత్తగా 140000 కోట్ల రూపాయిలు అప్పు చేశారని, దానిపై యనమల రామకృష్ణుడు మాట్లాడితే బాగుంటుందన్నారు. తెచ్చిన అప్పులో ఏకంగా 60000 కోట్ల రూపాయిలను పిచ్చి పిచ్చి ఖర్చులకు వాడేశారని బుగ్గన విమర్శించారు. కోట్లాది మంది కడుపు కొడుతూ పాలన సాగిస్తున్న టీడీపీ నేతలు కూడా నీతులు చెప్పడం ఏమీ బాగోలేదన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తామే కడుతామని తీసుకున్న చంద్రబాబు, ఇప్పుడు పోలవరా నికి కేంద్రమే అడ్డుపడుతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

buggana about yanamala కోసం చిత్ర ఫలితం

పోలవరం ఇక కలే అన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాయించు కుంటున్నారని మండి పడ్డారు. ప్యారడైజ్ పేపర్లలో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు ఉంటే, ఆయన జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి జగన్‌కు ప్రమేయం ఉందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు? నిమ్మగడ్డతో నాగార్జున, చిరంజీవికి కూడా వ్యాపార భాగస్వామ్యం ఉందని, మరి వారిద్దరిని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. కేవలం జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయం తోనే విమర్శలు చేస్తున్నారని బుగ్గన ఆరో పించారు. కాంట్రాక్టుల కోసం అంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి యనమల రామకృష్ణుడు అని విమర్శించారు.


యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యి వ్యాపారాలు, కాంట్రాక్టులు నడుపు తున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని బుగ్గన ప్రశ్నించారు. ప్రతిపనిలోనూ టీడీపీ నేతలు దోపిడి చేస్తూ, ప్రపంచంలోనే ఎక్కడా జరగని స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ అంటే  "టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ"  గా మారిపోయిందన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఫిరాయింపుదారులపై చర్యలు తీసు కోలేనని స్పీకర్ చెప్పడం దారుణమన్నారు. అసలు స్పీకర్‌ సరిగా పని చేస్తుంటే తామెందుకు కోర్టుకు వెళ్తమని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: