ఛీ..ఇంత దుర్మార్గమా..వీళ్లు మనుషులేనా..!

Edari Rama Krishna
దేశంలో కొంత మంది తమ కృర స్వభావాలు..వారు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే మనం అసలు సమాజంలో బతుకుతున్నామా..లేద అడవిలో జీవిస్తున్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  అడవిలో కృర జంతువులు సైతం తమకు ఆకలి వేసినపుడే వేట కొనసాగిస్తాయి..సాధారణంగా ఏ జీవి ఇతర జీవుల జోలికి వెళ్లవు. కానీ సమాజంలో బతుకుతున్న మనుషులు మాత్రం తమ అవసరాల కోసం ఎదుటి మనిషిని మోసం చేయడం,దోచుకోవడం అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు.  

భారత దేశంలో గత కొంత కాలంగా మతకల్లోలాలు సృష్టిస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు.  తమ స్వార్థం కోసం కొంత మంది నేతలు ఆడిస్తున్న ఆటలో పావులుగా మారి కులం, మతం అంటూ కొట్లాటలకు దిగుతున్నారు.  ఇలాంటి గొడవల్లో ఇప్పటి వరకు మనుషులు మద్య యుద్దాలు జరుగుతుండేవి.  తాజాగా మత కోణంలోకి మూగజీవాలను కూడా బలి చేస్తున్నారు.  ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘోరమే ఇందుకు ఉదాహారణ. మూగజీవాలు అని కూడా చూడకుండా కిరాతక చర్యకు పాల్పడ్డారు.

గుర్తు తెలియని దుండగలు ఆవులు, ఎద్దుల మీద యాసిడ్ దాడులు చేశారు.తాజ్ గంజ్ ప్రాంతంలో పోలాల్లో తిరుగుతున్న ఆవులు, ఎద్దుల మీద యాసిడ్ దాడులు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో గత కొంత కాలంగా గోరక్షక దళాల దాడుల నేపథ్యంలో మత కోణంలో ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడులకు పాల్పడింది ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై రాజా సింగ్ తెలిపారు.  ఇక ఆవులను పరిరక్షించే సీఎం యోగి ఆదిత్యానాథ్ రాష్ట్రంలోనే గోవులపై దాడులు జరగటంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
#UttarPradesh Miscreants throw acid on bulls and cows in Agra; FIR registered pic.twitter.com/nxj8J8Eq3j

— ANI UP (@ANINewsUP) August 22, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: