అయ్యో దున్నని అలా చంపేస్తున్నారే...

BSN
              

ఈ ప్రపంచంలో మ‌నిషిని మించిన క్రూర జంతువు వుండ‌క‌పోవొచ్చేమో అనిపిస్తుంది ఒక్కోసారి. చైనాలో బావోజియాంగ్ అనే గ్రామంలో కొన‌సాగుతున్న ఘోర సంప్రదాయాన్ని చూస్తే  పాపం అనాలో....వెర్రీ ....పిచ్చి అనాలో అర్దంకాని ప‌రిస్ధితి.

ప్రపంచంలో మేమే త్వర‌లో నెంబ‌ర్ వ‌న్ అని చెప్పుకుంటున్న చైనాలో మ‌న కన్నాకూడా క్రూర  సంప్రదాయాలు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా బావోజియాంగ్ గ్రామంలో ఏళ్ల కింద‌టి నుండి ఓ చెత్త ఆచారాన్ని పాటిస్తున్నారు. అదేంటంటే త‌మ గ్రామంలో జ‌నం బాగుండాల‌న్నా....పంట‌లు బాగా పండాల‌న్నా.. ఓ దున్నపోతుని స‌జీవంగా డాంగ్ ఫెస్టివ‌ల్ పేరిట ఉరితీస్తే స‌రిపోతుంద‌ట‌.

వేల‌మంది మ‌ద్య జ‌రిగే ఈ ఉరితీత కార్యక్రమం అంతా ఓ వేడుకలా చేస్తుంటారు అక్కడి ప్రజ‌లు. . మొద‌ట దున్నపోతుకి స్నానం చేయించి..పసుపు కుంకుమ‌లు పూసి పూల దండ‌లు వేసి  ఊరంతా ఊరిగేస్తారు. దాంతో దుష్టశక్తుల‌న్ని ఆ దున్నపోతులో చేరుతాయ‌ని ...అప్పుడు దున్నపోతుని ఉరితీస్తే ఆ శ‌క్తులు న‌శించిపోతాయ‌ని వారి ప్రగాడ న‌మ్మకం. తాడుతో బుల్ ని చెట్టుకి వ్రేలాడ‌దీసి అది చ‌నిపోయేంత‌వ‌ర‌కు అలాగే వుంచుతామ‌ని చెప్పుకుంటున్న బావోజియాంగ్ ప్రజ‌ల‌కు ఏం చెప్తే జంతువుల‌ను హింసించ‌కూడ‌దు అని తెలుస్తుందో చైనా అదికారుల‌కే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: