పేరుకే హిస్టారికల్.. అంతా బూతు సీన్లే..!

Chakravarthi Kalyan
చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.. మనకు తెలియని ఎన్నో కోణాలను ఆవిష్కరిస్తూ సాగే చారిత్రక గాధలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందులోనూ ఇప్పుడు పెరిగిన 
సాంకేతికత, గ్రాఫిక్స్ మాయాజాలంతో గతించిన చరిత్రను కళ్లముందు పునసృష్టి చేసే అవకాశం లభించింది. అందుకే చారిత్రక గాధలకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. అలాంటి ఒక చారిత్రకగాధ బీబీసీలో ప్రసారమవుతూ వివాదాస్పదంగా మారింది.  

ఇలాంటి సీన్లు కోకొల్లలు.. 


17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్‌' సీరియల్‌ గత బుధవారం ఫస్ట్ ఎపిసోడ్ బ్రిటన్ లో ప్రసారమైంది. చారిత్రక గాధ కదా చూద్దాం అని టీవీ సెట్ల ముందు కూర్చున్నవారు అందులోని బూతు సీన్లు చూసి నోరు వెళ్లబెట్టారట. ఏకంగా ఫస్ట్ ఎపిసోడ్ లోనే దాదాపు 7కుపైగా బూతు సీన్లు ఉన్నాయట. 

అదిరేలా అందాల ప్రదర్శన.. 


లూయిస్‌ -14 జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరించే ఈ బ్రిటన్‌లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్‌ డ్రామాగా పేరొందింది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే గే సెక్స్‌, రాకుమారి సెక్స్ వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు. ఇంగ్లీష్ లో రూపొందిన ఈ సీరియల్ పై బ్రిటన్ లో ఆందోళన ప్రారంభమైందట. చరిత్ర పేరు చెప్పి చవకబారు కథనంతో సీరియల్ రూపొందించారని విమర్శిస్తున్నారట.

మరోవైపు తమ రాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని అటు ఫ్రాన్స్ లోనూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయట. బీబీసీ మాత్రం ఫ్రాన్స్‌లో నిర్మితమైన ఈ సీరియల్‌ వీక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెబుతోంది. దాదాపు రూ. రెండు వందల కోట్ల ఖర్చుతో ఈ సీరియల్ నిర్మించారు. అయితే అంతగా ఖర్చుపెట్టినా డైలాగ్‌లు నాసిరకంగా ఉన్నాయని, తొలి ఎపిసోడ్‌ ఏమాత్రం ఆసక్తికరంగా లేదన్న టాక్ వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: