మన ఇండియా.. సోమాలియా కంటే వరస్టా...!?

Chakravarthi Kalyan
ఈ ప్రపంచం భిన్న నాగరికతల మయం. దాదాపు 200 దేశాలున్న ఈ ప్రపంచంలో ఒక్కో దేశానిది ఒక్కో తీరు. అన్ని రకాల సుఖ సంతోషాలతో జీవించే దేశాలు కొన్నైతే.. నిత్యం యుద్ద వాతావరణంలో రుద్రభూమిగా కనిపించేవి మరికొన్ని. తిండి ఎక్కువై ఒబేసిటీతో జనం బాధపడే దేశాలు కొన్నైతే.. తినడానికి తిండి లేక ఆకలి చావులు కనిపించే దేశాలు కొన్ని.

మరి ఏ దేశంలో సంతోషంగా ఉంటున్నారు.. ఏ దేశంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనే అంశాలను తెలుసుకునేందుకు ఏటా ఓ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వేలో ఈ ఏడాది కొన్ని సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనుంచి మన ప్లేస్ మరింతగా దిగజారింది.  ఈ జాబితాలో గత ఏడాది 117వ స్థానం దక్కించుకున్న భారత్‌ ఈ ఏడాది ఓ ర్యాంకు దిగజారింది. 

మొత్తం ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ జాబితా రూపొందించారట. మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న స్థిరాభివృద్ధి పరిష్కారాల సంస్థ ఈ జాబితాను రూపొందించింది. మరి సంతోషాన్ని లెక్కించడం ఎలా.. దానికి ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు..?

ఒక దేశం  స్థూల జాతీయోత్పత్తి, మనిషి జీవిత కాలం, సామాజిక మద్ధతు, అవసరాల ఎంపికకు ఉన్న స్వేచ్ఛ ఆధారంగా ఈ సంతోషకరమైన దేశాల జాబితా రూపొందిస్తారట. ఈ జాబితాలో ఈ ఏడాది డెన్మార్క్‌ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్విట్జర్లాండ్‌ ఈసారి సెకండ్ ర్యాంకు సాధించింది. మరి మన పెద్దన్నఅమెరికాకు 13వ స్థానం దక్కింది. 

మన ఇండియా మాత్రం కరువు దేశమైన సోమాలియా కంటే దారుణంగా.. అంతర్యుద్ధంతో సతమతవుతున్నపాలస్తీనా కంటే హీనంగా ర్యాంకు సాధించింది. చివరకు మన తోటి దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచి ర్యాంకే సాధించాయి. అదీ సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: