మరో వివాదంలో హర్భజన్ సింగ్..!

Edari Rama Krishna
భారత దేశంలో క్రికెట్ అంటే ఎంతగానో అభిమానిస్తారు.. ముఖ్యంగా సినిమా యాక్టర్ల కంటే క్రికెట్ ఆటగాళ్లంటేనే చాలా మందికి ఇష్టం.. ఇక భారత క్రికెటర్ హర్బజన్ సింగ్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించేవాడు. అంతే కాదు  హర్బజన్ సింగ్ సంగీత ప్రియుడు, పాటలు కూడా అద్భుతంగా పాడతాడు. తాజాగా బజ్జీ తన చిన్ననాటి స్నేహితురాలు..గీతా బస్రా వివాహం జరిగింది.  హర్భజన్ సింగ్ పెళ్లిలో బౌన్సర్లుగా అతిగా స్పందించి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. 


విషయం తెలుసుకున్న హర్భజన్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు.  పోలీసులు వెంటనే కుల్ దీప్, గురుప్రీత్, నవ్ జ్యోత్, భావన్ లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వివాదం దేవమంతా వ్యాపించి గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్న బజ్జీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. హర్బజన్ సింగ్ తన వివాహం అందరికీ జీవితాంతం గుర్తుండి పోయాలా విందులు, వినోదాల ఏర్పాట్లు చేశారు. ఇక మెహందీ నుంచి హడావిడి మొదైలంది..పెళ్లీ, బారాత్ వరకు తెగ హల్ చల్ చేశారు. 


గీతా బస్రా తో హర్భజన్ సింగ్


అంతా హ్యాపీగా అయిపోయిందనుకున్న సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులకు భజ్జీ పదకొండు రకాల పొగాకు ఉత్పత్తులు, హుక్కా అందజేశారని, ఇది సిక్కుల సంప్రదాయాల్ని కించపరచడమేని పేర్కొంటూ సిక్కు సంఘం కేసు వేసింది.తన పెళ్లి చిత్రీకరణకు వచ్చిన మీడియాపై బౌన్సర్లు దాడి చేయడం బజ్జీ మీడియాకు సారీ చెప్పడంతో అయిపోయింతనకున్న గోల ఇప్పుడు  మత సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన హర్బజన్ సింగ్ వెంటనే సమాధానం చెప్పి, క్షమాపణలు చెప్పాలని ఉత్తరాదికి చెందిన సిక్కు సంఘం నేతలు డిమాండ్ చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: