“భారతీయులే” ముందున్నారు..అమెరికా సంచలన ప్రకటన

Bhavannarayana Nch

వివిధ దేశాలలో ఉన్నత స్థితి కోసం, టెకీలు మొదలు అనేక రంగాల నిపుణులు  భారత్ నుంచీ వివిధ దేశాలకి వలసలు వెళ్తూ ఉంటారు..అయితే ఇలా వివిధ దేశాలలో ఉన్న వలస దారులతో పోల్చితే భారత్ నుంచీ వెళ్ళిన ప్రవాసీయులే అత్యధికమని చెప్తున్నారు ఆయా దేశాల విదేశీ వ్యవహారాల శాఖలు అయితే అగ్రరాజ్యం అయిన అమెరికాలో సైతం ఎన్నారై లలో భారతీయులే అత్యధికమని అంటున్నారు యూఎస్‌సీఐఎస్‌..

 

అమెరికాలో  ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఎన్నారై లకోసం వీలు కల్పించే హెచ్‌–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కాయని...2016లో  74.2%, 2017లో 75.6 శాతం హెచ్‌–1బీ వీసాలు భారతీయులకే లభించాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది...అంతేకాదు ఈ సమయంలో కొత్తగా హెచ్‌–1బీ వీసాలు పొందిన భారతీయుల సంఖ్య తగ్గిందనీ..గతంలో వీసాలు పొందిన వారికి వీసా పొడిగింపులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

 

అయితే ఈ నివేదికని గత నెల 10నే యూఎస్‌ చట్టసభ్యులకు యూఎస్‌సీఐఎస్‌ సమర్పించగా, అందులోని వివరాలు తాజాగా బయటకొచ్చాయి. సాధారణంగా హెచ్‌–1బీ వీసాను తొలిసారి మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది...మొత్తంగా 2016లో 2,56,226 మంది, 2017లో 2,76,423 మంది భారతీయులకు హెచ్‌–1బీ వీసాలు లభించాయి...అయితే భరత్ తరువాత చైనా రెండవ స్థానంలో నిలిచిందని అంటున్నారు యూఎస్‌సీఐఎస్‌ అధికారులు..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: