బట్టతల ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఇక అలా ఎవరన్నా కేసు పెట్టొచ్చు?
పురుషులు క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల కంటే జుట్టు రాలే సమస్యనే మరింత ప్రమాదకరంగా భావిస్తున్నారు అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే అటు చిన్న వయసులోనే జుట్టు రాలిపోయి బట్ట తల వస్తూ ఉండడంతో.. ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్టతల ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రాక.. ఇంకో వైపు సమాజంలో బట్టతల ఉన్న వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడటం లాంటివి హెయిర్ లాస్ తో ఇబ్బంది పడుతున్న వారిని ఎంతగానో క్రుంగతీస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
అయితే తల మీద వెంట్రుకలు లేకుండా బట్టతల వచ్చిన వ్యక్తిని బట్ట తలోడా అని స్నేహితులు బంధువులు పిలుస్తూ సెటైర్లు వేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా బట్ట తలోడ అని ఇప్పుడు ఎవరైనా అన్నారు అంటే కేసు పెట్టొచ్చట. ఈ విషయంపై యూకే కోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చింది. తల మీద వెంట్రుకలు లేని వ్యక్తిని బట్టతలోడా అని తిట్టడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని యూకే కోర్టు తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల బ్రెస్ట్ కామెంట్స్ చేయడంతో సమానం అంటూ పేర్కొంది. బ్రిటిష్ బండ్ అనే సంస్థలో పనిచేస్తున్న టోనీ ఫిన్ అనే వ్యక్తిని సూపర్వైజర్ జెమీ కింగ్ ఓ సందర్భంలో బట్ట తోలోడు అంటూ బూతులు తిట్టారు. అయితే ఫిన్ కోర్టును ఆశ్రయించగా యూకే కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే మన దేశంలో కూడా ఇలాంటి రూల్ తీసుకు వస్తే బాగుండు అని ఎంతోమంది కోరుకుంటున్నారు.