సింగిల్స్ కి బంపర్ ఆఫర్.. డేటింగ్ కి వెళ్తే ఖర్చులకి డబ్బులు.. ఎక్కడంటే?

praveen
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో అటు చెైన మొదటి స్థానంలో ఉంది అన్న విషయం తెలిసిందే. పొరుగున ఉన్న ఇండియాతో పోల్చి చూస్తే విస్తీర్ణంలో చైనా చిన్నగానే ఉన్నప్పటికీ అటు జనాభా విషయంలో మాత్రం భారత్ కంటే ముందుంది. అయితే ఇలా అటు చైనాలో విపరీతంగా జనాభా పెరుగుదల ఉండడంతో అక్కడి ప్రభుత్వం పిల్లలను కనడం విషయంలో ఎన్నో నిబంధనలు పెట్టింది. కేవలం భార్యాభర్తలు ఇద్దరు ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలి అంటూ సూచించింది. అయితే చైనాలో పెరిగిపోయిన జీవన వ్యయం కారణంగా అక్కడ పిల్లలను కనెందుకే ఎంతోమంది ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది.

 ఇక ఇలాంటి పరిణామాలు చైనాలో జననాల రేటు విపరీతంగా తగ్గిపోయేందుకు కారణమయ్యాయి. ఇక ఇప్పుడు చైనా అటు జనాభాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ జననాల రేటు తగ్గిపోవడంతో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇది చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితికి కారణం అవుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య మళ్లీ జననాల రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం నడుంబించింది. ఈ క్రమంలోనే ఏకంగా పిల్లలను కనే వారికి నజరానాలు ప్రకటించడం కూడా మొదలుపెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే చైనా కి సంబంధించిన ఒక కంపెనీ తమ కంపెనీలో పనిచేసే సింగిల్స్ కి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 జన్ శెంగ్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులు డేట్ కి వెళితే నగదు బహుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. కంపెనీలో సింగిల్స్ కు డేటింగ్ ఖర్చులకోసం ఏకంగా 770 రూపాయలు అందిస్తుందట ఆ కంపెనీ. ఒకవేళ అప్పటికే డేటింగ్ లో ఉంటే ఇద్దరికీ చెరో రూ. 11650 ఇస్తుందట. అక్కడ యువత పెళ్లిలు చేసుకోవడానికి ఇష్టపడకపోవడం తద్వారా జననాల  రేటు తగ్గుతూ ఉండడంతో.. అక్కడి ప్రభుత్వంతో పాటు ఇక చైనాకు సంబంధించిన కంపెనీలు కూడా ఇలా వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: