ఆ ఇద్దరి టాప్ హీరోల మధ్య తేడాను బయటపెట్టిన బాబి !

Seetha Sailaja
రైటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాబి ఆతరువాత దర్శకుడుగా మారి సినిమాలు తీస్తున్నాడు. అయితే అతడికి చిరంజీవితో పాటు బాలకృష్ణతో కూడ భారీ సినిమాలను తీసే అవకాశం రావడం యాదృచ్చికం. రెండు సంవత్సరాల క్రితం చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అవ్వడంతో అతడి పేరు మారుమ్రోగిపోయింది.

ఇప్పుడు బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీలో బాలయ్యను ఒక డిఫరెంట్ యాంగిల్ లో బందిపోటు గా బాబి చూపెడుతున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు అదేవిధంగా టైటిల్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈసారి సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ వెంకటేష్ ల మూవీలతో పోటీ పడుతున్న పరిస్థితులలో సంక్రాంతి సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బాలయ్య మూవీ సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య బాబి ఒక మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి బాలకృష్ణల మధ్య ఉన్న తేడాను వివరించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

చిరంజీవి తాను నటించబోయే మూవీ కథ పూర్తిగా తెలుసుకోవాడమే కాకుండా ఆకథకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ ను ముందుగా తెప్పించుకుని ప్రతి సీన్ వివరంగా దర్శకుడుతో మాట్లాడటమే కాకుండా అనేక సూచనలు సలహాలు ఇస్తాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే బాలకృష్ణ మాత్రం దీనికి పూర్తిగా విభిన్నం అని అంటున్నాడు. బాలయ్య ఒక్కసారి దర్శకుడుని నమ్మి కథ ఒప్పుకున్న తరువాత ప్రతి సీన్ విషయంలోను ఎటువంటి సలహాలు ఇవ్వడని దర్శకుడు ఎలా నటించమంటే అలా నటిస్తూ ఒకొక్కసారి దర్శకుడు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని చాల నిశితంగా పరిశీలిస్తూ పూర్తిగా దర్శకుడి చెప్పుచేతలలో ఉండటం బాలయ్య అలవాటు అని అంటున్నాడు. ఈ అలవాటు బాలయ్యకు తన తండ్రి నందమూరి తారకరామారావు నుంచి వచ్చింది అని బాలయ్య తనతో చెప్పాడని బాబి అభిప్రాయపడుతున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: