కడప ఫ్యాక్షన్ ను మించిపోయిన అమెరికా గన్ కల్చర్.. వలస విద్యార్థులకు ప్రతిక్షణం ప్రాణ సంకటమే?
నిజమే అమెరికాలో స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి స్వేచ్ఛ ఏకంగా ప్రాణాలు తీస్తుంది. అమెరికాలో రోజురోజుకు పెరిగిపోతున్న గన్ కల్చర్ వలస విద్యార్థుల పాలిట శాపంగా మారిపోతుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు వచ్చి కాల్పులు జరుగుతారో ఎక్కడ తూటాలు శరీరంలోకి చొచ్చుకు పోతాయో.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అందరూ అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి. ఒకప్పుడు కడపలో ఫ్యాక్షనిజం ఉండేది. ఒకరిని ఒకరు పగలతో దారుణంగా కత్తులతో నరుక్కునేవారు. ఎక్కడ చూసినా రక్తపాతమే ఉండేది అని సినిమాల్లో చూడడమే కాదు రియల్ లైఫ్ లో కూడా జరిగిందని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కడప ఫ్యాషన్ మించిపోయింది. అమెరికాలో అంగట్లో కూరగాయలు దొరికినట్లు ఏకంగా తుపాకులు అమ్ముతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏకంగా స్కూలుకు వెళ్లే ఆరేళ్ల పిల్లాడు ఫుల్లీ లోడెడ్ గన్ తన పాకెట్లో పెట్టుకుని స్కూలుకు తీసుకువెళ్లిన ఘటన జరిగిందంటే అక్కడ గన్ కల్చర్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రతిరోజు అక్కడ 110 మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు. ఇందులో వలస విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. మరి ముఖ్యంగా భారత విద్యార్థులకు అక్కడ రక్షణ లేకుండా పోయింది ఏకంగా వలస వచ్చిన విద్యార్థులనే టార్గెట్ చేసుకుంటూ ఎంతోమంది మాస్ షూటింగ్స్ కి పాల్పడుతున్నారు. దీంతో ఇలా ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వారి భద్రత ఆందోళనకరంగా మారింది. ఓ నివేదిక ప్రకారం ఏకంగా ప్రతి ఏడాది 633 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. ఇందులో 108 మంది మరణాలు ఒక్క యుఎస్ లోనే సంభవిస్తున్నాయి అని నివేదిక రిపోర్ట్ చెప్పింది. దీన్ని బట్టి అగ్రరాజ్యమైన అమెరికాలో భారతీయ విద్యార్థులు భద్రత ఎంత క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.