చేయని నేరానికి జైలు.. చివరికి కోటీశ్వరుడయ్యాడు?

praveen
మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. ఒకరు నేరం చేస్తే వారికి బదులుగా ఇంకొకరు పొరపాటున నిందితుడిగా తేలి జైలు శిక్ష అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు అయ్యో పాపం అతడు నిర్దోషి అయినప్పటికీ కూడా ఇలా అతన్ని ఇరికించి చివరికి అతను చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే రియల్ లైఫ్ లో కూడా ఇలా జరుగుతూ ఉందా అంటే మాత్రం చాలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.

 ఎంతోమంది జరిగిన నేరంతో సంబంధం లేకపోయినప్పటికీ చేయని నేరానికి చివరికి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక ఇలా ఎవరి విషయంలో అయినా జరిగింది అంటే వారి అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చేయని నేరానికి ఒక వ్యక్తి జైలు శిక్ష అనుభవించడం అతని పాలిట శాపంలా కాదు ఏకంగా వరంలా మాలిపోయింది. అదేంటి చేయని నేరానికి చైల్డ్ శిక్ష అనుభవిస్తే అది అది అన్యాయం అవుతుంది. కానీ అతనికి లాభం ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా.

 ఇలా జైలు శిక్ష అనుభవించడం కారణంగానే అతను ఏకంగా కోట్ల రూపాయలకు పొందగలిగాడు. అమెరికాలో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తికి ఏకంగా 419 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలని అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. 2008లో ఒక వ్యక్తిని హత్య చేశాడు అన్న అభియోగాలతో మార్షల్ బ్రౌన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే బ్రౌన్ తరుపు లాయర్లు ఆయన హత్య చేయలేదు అని కోర్టులో ఆధారాలను ప్రవేశపెట్టారు. దీంతో ఇలా చేయని నేరానికి శిక్ష అనుభవించిన అతనికి 419 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి అంటూ చికాగో పోలీసులను కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: