కిమ్ మరో షాకింగ్ రూల్.. ఆ హెయిర్ స్టైల్ ఉంటే జైలుకే?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ప్రజాస్వామ్య పాలన సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడే ఇక ప్రజలను పాలించడం జరుగుతూ ఉంది. ఇండియాలో కూడా ఇలాంటి ప్రజాస్వామ్య పాలనే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. కానీ  నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా నియంత పాలన సాగిస్తూ ప్రజలను మనుషుల్లా కాదు బానిసలుగా చూసే పాలకుడు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గుర్తుకు వస్తూ ఉంటాడు.

 ఎందుకంటే నియంత పాలన సాగిస్తూ ప్రజలని బానిసలుగా చూస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు ఈయన. ఏకంగా ఆయన పెట్టే కొన్ని కొన్ని నిబంధనలు అయితే ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యంలో ముంచేత్తుతూ ఉంటాయి. అంతలా దారుణంగా పాలన సాగిస్తూ ఉంటారు. ఇక అక్కడ ప్రజలు ఎక్కువగా నవ్వకూడదు. ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోకూడదు. ఇష్టం వచ్చిన చదువు చదవకూడదు. ఇష్టం వచ్చిన చోటికి వెళ్లకూడదు. ఇలాంటివన్నీ కూడా కిమ్ జాంగ్ ఉన్ చెప్పినట్లుగానే జరగాలి. తినే తిండి దగ్గర నుంచి ఇక ఉండే ఇల్లు వరకు ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్లుగానే ప్రజలు నడుచుకోవాలి. ఎవరైనా ధైర్యం చేసి ఎదురు తిరిగితే.. వారిని దారుణంగా చంపేస్తూ ఉంటాడు ఈ నియంత.

 ఇలా రాక్షస పాలనకు కేరాఫ్ ఫొటోస్ గా ఉండే కీమ్ జాంగ్ ఉన్.. ఇటీవల మరో షాకింగ్ రూల్ తీసుకోవచ్చాడు. ఉత్తర కొరియా దేశంలో ఎవరు కూడా పోనీ టైల్స్ ని వేసుకోకూడదు అంటూ నిషేధించారు. ఎవరైనా అలాంటి హెయిర్ స్టైల్ తో పట్టుబడితే.. వారికి ఆరు నెలల కఠినమైన జైలు శిక్ష తప్పదు అంటూ రూల్ పెట్టాడు. శత్రువులపై యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సెమి ట్రాన్స్పరెంట్ స్లీవ్స్, జీన్స్, రంగేసుకున్న లేదంటే పొడవు జుట్టూ, బిగుతూ దుస్తులు లాంటివన్నీ కూడా దక్షిణ కొరియా ఫ్యాషన్స్ అని.. అలాంటివి ఉత్తర కొరియాలో కనిపించకూడదు అంటూ సరికొత్త నిబంధన పెట్టారు. ప్రతి ఒక్కరు ఇది పాటించాల్సిందే అంటూ ఆదేశించాడు కిమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

kim

సంబంధిత వార్తలు: