అద్భుతం.. ఇతను మృత్యుంజయుడే.. చనిపోయిన గర్భం నుంచి పుట్టాడు?

frame అద్భుతం.. ఇతను మృత్యుంజయుడే.. చనిపోయిన గర్భం నుంచి పుట్టాడు?

praveen
ఇట్స్ ఏ మేరాకిల్.. వైద్య చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఇదొక అద్భుతం అనే డైలాగ్లను సినిమాలో మన ఎక్కువగా వింటూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక కేవలం ఫన్ జనరేట్ చేయడానికి మాత్రమే ఇలాంటి డైలాగులను చెప్పించడం చేస్తూ ఉంటారు డైరెక్టర్లు. కొన్ని కొన్ని సార్లు సెంటిమెంట్ సీన్లలో కూడా ఇలాంటి డైలాగులను చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అది సరేగాని ఇప్పుడు ఈ డైలాగ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.  ఇక ఇప్పుడు సినిమాలో కాదు నిజ జీవితంలో కూడా ఇలాంటి డైలాగ్ కు సరిపోయే విధంగా ఒక అరుదైన ఘటన జరిగింది.

 ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత కూడా మీరు ఇట్స్ ఏ మిరాకిల్ అని అనకుండా అసలు ఉండలేరు అని చెప్పాలి. సాధారణంగా మహిళ గర్భం లోపల శిశువు ప్రాణాలు కోల్పోతే ఆపరేషన్ చేసి వైద్యులు పిండాన్ని బయటకు తీయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఒకవేళ గర్భంతో ఉన్న మహిళ చనిపోతే ఇక కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా గర్భంతో ఉన్న మహిళ చనిపోయినప్పటికీ ఏకంగా లోపల ఉన్న శిశువు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. వైద్య చరిత్రలో ఎంతో అరుదైన ఘటన ఇది అని వైద్యులు సైతం చెప్పేసారు. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఇది ఎక్కడో కాదు ప్రస్తుతం యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాలో గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక భవనం పై ఆ దేశం దాడి చేసింది  దీంతో తీవ్రంగా గాయపడిన నిండు గర్భిణీ అతి కష్టం పై దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం కొద్దిసేపటికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే వైద్యులు ఆమెకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేయగా.  శిశువు హార్ట్ బీట్ వినిపించింది. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఇలా వైద్య చరిత్రలో ఇదో అద్భుతం అంటూ వైద్యులు అభివర్ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: