సంతోషంగా లేకపోతే.. ఉద్యోగులకు 10 రోజులు సెలవులు.. కంపెనీ వినూత్న ప్రకటన?

praveen
ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి జీవనాన్ని గడుపుతూ  ఉన్నారు. మనీ వెంట పరుగులు పెడుతూ జీవితంలో హ్యాపీగా బ్రతకాలి అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలా ఉరుకుల పరుగుల జీవితంలో చివరికి పనిచేస్తూ చేస్తూ  ఒకానొక సమయంలో ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. లైఫ్ అంటే ఇంతేనా.. పొద్దున లేచి ఆఫీస్ కి వెళ్లడం. రాత్రి వచ్చి తిని పడుకోవడం. ఇదంతా చూస్తుంటేనే జీవితం పై విరక్తి వస్తుంది అంటూ ఎంతో మంది ఉద్యోగులు అనుకుంటూ ఉంటారు.

 అయితే ఈ మధ్య కాలంలో కంపెనీలు ఇలా తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఒత్తిడిని తగ్గించేందుకు సెలవులను కాస్త ఎక్కువగా ఇస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో అటు శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు సెలవులు ఇస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇలా వారానికి రెండు రోజులు సెలవులు దొరికినప్పటికీ.. ఉద్యోగుల్లో ఉన్న ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఎంతో మంది వ్యక్తిగత ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసమే ఇక్కడ ఒక కంపెనీ అద్భుతమైన ఆలోచన చేసింది.

 ఉద్యోగులు వ్యక్తిగత ఉద్యోగ జీవితాన్ని బాలన్స్ చేయడం లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. చైనా లోని పాంగ్ డాంగ్ అనే ఒక రిటైల్ కంపెనీ కొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది. సంతోషం గా లేని ఉద్యోగులకు దాదాపు పది రోజుల పాటు అదనపు సెలవులకు ఇస్తాము అంటూ ఆ సంస్థ ఇటీవల ప్రకటన చేసింది. ప్రతి ఉద్యోగికి స్వేచ్ఛ ఉండాలని మేము కోరుకుంటాము.. అందుకే ఎవరైనా ఉద్యోగి సంతోషం గా లేము అని అనిపిస్తే వాళ్ళు ఆఫీసుకి రావద్దు అంటూ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయగా.. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: