ఏడాదికి రూ.16 కోట్లు.. యువకుడిలా మారిన 46 ఏళ్ళ వ్యక్తి?
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అయితే మరో రకమైన పిచ్చి. ఏకంగా వృద్ధాప్యం దగ్గర పడుతున్న సమయంలో యువకుడిగా కనిపించాలి అనే ఒకపిచ్చి ఆలోచన అతనికి వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఆలోచన వస్తే ఎవరైనా ఏం చేస్తారు అలా మారడానికి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సర్జరీలు చేయించుకోవాలి.. అదంతా ఎందుకు అని ఊరుకుంటారు. కానీ ఇతని దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఇంకేముంది తన పిచ్చి ఆలోచనను ఆచరణలో పెట్టాడు. 46 ఏళ్ల వ్యక్తి ఏకంగా 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ఇది తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.
అమెరికన్ టెక్ మిలియన్ 40 ఏళ్ళ బ్రయాన్ జాన్సన్ 18 ఏళ్ల యువకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం ఏకంగా దీనికోసం 16 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాడు అయితే గత ఆరేళ్లలో తన ముఖంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూపించే విధంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2018, 2023, 2024 ఫోటోలని షేర్ చేశాడు అయితే తనని కనీసం ఫేస్ ఐడి కూడా గుర్తుపట్టలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఇలా యంగ్ గా కనిపించేందుకు రోజుకు 100 టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు బ్రయాన్ జాన్సన్.