ఇజ్రాయిల్ షాకింగ్ డెసిషన్.. ఆ డేంజరస్ వెపన్ వాడబోతుందట?

praveen
ప్రస్తుతం ఇజ్రాయిల్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం  కొనసాగుతూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. తమ దేశ రక్షణ విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటే ఇజ్రాయిల్ ఇక ఏకంగా తమ దేశంపై రాకెట్లను ప్రయోగిస్తున్న తీవ్రవాదులను మట్టు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఇక ఇలాంటి రాకెట్ ప్రయోగాలు చేస్తే సరైన బుద్ధి చెబుతామూ అంటూ ఇజ్రాయిల్ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. చివరికి ఇక హెచ్చరికలు మాత్రమే కాదు ఆయుధ ప్రయోగం కూడా చేసింది. దీంతో హిజబుల్లా,అమాస్ తీవ్రవాదులపై బాంబుల వర్షం కురిపించింది. ఇక ఈ యుద్ధంలో ఎంతోమంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
 అయితే ఒకానొక సమయంలో ఇజ్రాయిల్ అమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కూడా ఉంది అని ఎంతో మంది రక్షణ రంగా నిపుణులు కూడా అంచనా వేశారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఉగ్రవాదులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఒకసారి కొత్త ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది అంటే అణు ఆయుధం అని చెబుతారు అందరూ.

 ప్రపంచంలో ప్రమాదకరమైన అణ్వయుధాల తర్వాత అంతటి ప్రమాదకరమైనదిగా చెప్పే లేజర్ బీమ్లను ఇజ్రాయిల్ వాడేందుకు  సిద్ధమైందట. ఏకంగా ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా లేదట. లేబనాన్ లోని హిజ్బుల్లను పూర్తిగా తుడిచి పెట్టేందుకే ఆ దేశం లేజర్ బీమ్లను వాడొచ్చు అని ఎంతో మంది పరిశీలములు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ పౌరులను ముందు జాగ్రత్తగా హెచ్చరికలను జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా 2014లో తొలిసారిగా ప్రదర్శించిన లేజర్ భీమ్ ఆయుధాలకు ఏకంగా ఎంతో ప్రమాదకరమైన రాకెట్లను సైతం సెకండ్ల వ్యవధిలో తునా తునకలు చేసే శక్తి ఉంటుంది. ఒకవేళ ఇజ్రాయిల్ నిజంగానే లేజర్ కిరణాలను ప్రయోగించింది అంటే ఇది ఏకంగా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అని ఊహించడం కూడా కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: