ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధంలోకి.. పుతిన్ ఎంట్రీ.. ఏం జరుగబోతుందో?

praveen
ఉక్రెయిన్, రష్యా మధ్య ఎలా అయితే ఎడతెరిపి లేకుండా యుద్ధం సాగుతూ ఉందో.. అటు ఇజ్రాయిల్, హమాస్ మధ్య కూడా ఇలాగే యుద్ధం జరుగుతుంది. ఏకంగా హమాస్ ఇజ్రాయిల్ పై మొదట బాంబుల వర్షం కురిపించగా.. ఇక తమ దేశ భద్రత విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గని ఇజ్రాయిల్ కూడా అటు హమాస్ తీవ్రవాదులు ఉండే గాజాపై కూడా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

 చివరికి ఏకంగా ఇరుదేశాల ప్రజలు ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో అని భయపడుతూ.. ఎప్పుడు ప్రాణం పోతుందో భయంతోనే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే యుద్ధ విరమణకు అటు హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగిన విఫలం అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంట్రీ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ముందు పెట్టుకొని హమాస్ సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకుందట.

 ఈ క్రమంలోనే హమాస్ తమ దగ్గర ఉన్న ఇజ్రాయిల్ కు బందీలను విడుదల చేస్తామని ఒక ప్రకటన చేసింది. అదే సమయంలో ఇక ఇజ్రాయిల్ దగ్గర బందీలుగా ఉన్న హమాస్ ప్రముఖులను విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైందట. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే బందీల విడుదల ఉంటుంది అని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇలా పుతిన్ సమక్షంలో కొంతమంది ఖైదీలను విడుదల చేసిన తర్వాత.. ఇజ్రాయిల్ ఇక ప్రముఖులను విడుదల చేయాలని ఉద్దేశంతోనే ఇలాంటి ప్రకటన చేశారట. అయితే ఇలా ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంలోకి పుతిన్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో  పరిస్థితులు ఎక్కడ వరకు వెళ్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: