ఆమె వయస్సు 39, పిల్లలు 19 మంది.. అందరికీ తండ్రులు వేరు?

praveen
సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ వింత జరిగిన కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో నిమిషాల వ్యవధిలో వాలిపోతుంది. దీంతో ఇక ఎన్నో విషయాలు ప్రతి రోజు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఆయా విషయాలను తెలుసుకొని నేటిజన్స్ అందరు కూడా కొన్ని కొన్ని సార్లు షాక్ కి గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఒకే వ్యక్తికి పది మందికి పైగా భార్యలు ఉండడం చూసాం. ఒక మహిళకి ఎక్కువ మంది భర్తలు ఉండి ఇక 20, 30 మంది పిల్లలు ఉండడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి కృషి చేసాయ్.

 అయితే ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన అయితే అంతకుమించి అనే రేంజ్ లోనే ఉంది. మెడలిన్ లో 39 ఏళ్ల మార్త అనే మహిళకు 19 మంది పిల్లలు ఉన్నారు. అందులో 15 మంది పిల్లలు 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ప్రతి పిల్లాడికి తండ్రులు వేరు కావడం గమనార్హం. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా పిల్లలను కనేందుకు ఆమెకు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. ఇక ఆమెకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలా గర్భం దాల్చడం పిల్లలకు జన్మనివ్వడమే నా పని అంటూ ఇక మార్త చెప్పుకొచ్చింది.

 మెడలిన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా 19 పిల్లలతో మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఇంట్లో నివసిస్తుంది సదరూ మహిళ. ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేకపోవడంతో పెద్ద పిల్లలు సోఫాలో నిద్రిస్తారని.. ఇక నాకు నా పిల్లలకి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ ఆ డబ్బు సరిపోదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయా పిల్లల తండ్రిలు ఎవరు కూడా పిల్లల బాధ్యతను పట్టించుకోవట్లేదు అంటూ మార్తా చెప్పుకొచ్చింది. ఇక ఇరుగు పొరుగు వారు కూడా తనకు సహాయం అందిస్తారు అంటూ తెలిపింది. ఈ వార్త గురించి తెలిసి జనాలు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు. వేరు వేరు వ్యక్తులతో ఇంతమంది పిల్లలకు జన్మనివ్వడం ఏంటీ.. అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి.. మరి ఆర్థిక సహాయం చేయడం ఏంటి అని షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: