నచ్చిన కంపెనీలో ఉద్యోగం పోవడమే.. ఆమెకు బాగా కలిసొచ్చింది?
ఐర్లాండ్కు చెందిన మరియానా కోబయాశీకి లింక్డిన్ లో పనిచేయడం ఒక కల. ఇక ఎన్నో కంపెనీలు తిరస్కరణ తర్వాత ఆమెకు తాను కలలుకనే కంపెనీలో జాన్ వచ్చింది. ఇక మంచి జీవతం ఇక కోరుకున్న జాబ్ అంతకంటే ఇంకేం కావాలి అనుకుంది. కానీ గత ఏడాది ఆర్థిక మద్యం కారణంగా చివరికి సంస్థ ఎంతో మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఈమె కూడా ఉండడం గమనార్హం. అయితే ఇలా ఉద్యోగం ఊడిపోవడమే ఆమెకు అదృష్టంగా మారింది. ఇక ఉద్యోగం పోయిన తర్వాత మళ్లీ ఇతర కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత గూగుల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాదాపు రెట్టింపు జీతంతో ఉన్నత స్థాయి జాబు ఆఫర్ చేయడంతో ఆమె ఎగిరి గంతేసింది.
ఈ క్రమంలోనే ఇలా ఉద్యోగం కోల్పోయిన సమయంలో తన మానసిక సంఘర్షణ ఎలా ఉంది అన్న విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్నా సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నాకున్న వాల్యూ ని ఉద్యోగంతో ముడి పెట్టకూడదని లేదంటే ఎప్పుడు సంస్థలను నమ్ముకుని ఉండొద్దనె అనుభవం నాకు వచ్చింది. అయితే ఉద్యోగం ఊడిన తర్వాత మరో ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ఆపలేదు. అంతలోనే గూగుల్ కార్యాలయంలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు ఒక మెయిల్ వచ్చింది. ఇది చూసి నేను గర్వపడుతున్నాను అంటూ అని చెప్పుకొచ్చింది ఆమె.