ఓరినాయనో.. వీడిని మించిన తోపు డ్రైవర్ ఇంకొకరు ఉండరేమో?

praveen
సాధారణంగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకూడదు అంటే ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ప్రకారమే వాహనాలు నడపాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హెవీ వెహికిల్స్ నడిపేవారు ఎంత అప్రమత్తంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెనక ముందు చూసుకుంటూ వాహనం నడపాల్సి ఉంటుంది. ఏమాత్రం అటు ఇటు అయినా కొన్ని కొన్ని సార్లు అమాయకుల ప్రాణాలు పోతే ఇంకొన్నిసార్లు ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

 అయితే ఇలా హెవీ వెహికల్స్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కానీ హెవీ వెహికల్ తో కూడా ఎంతోమంది ఎవరికి సాధ్యం కాని రికార్డులు సృష్టిస్తారు అన్నదానికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ గా మారిపోయింది.  ఏకంగా నిత్య సాధన చేస్తే దేనినైనా ఎంతో సులభంగా సాధించవచ్చు అన్న విషయం ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని చెప్పాలి. చాలామంది వాహనదారులు ఏకంగా కార్లను పార్కింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉంటాం.

 కానీ ఇక్కడొక ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్ చేసిన తీరు చూసిన తర్వాత ఇతన్ని మించిన తోపు డ్రైవర్ ఇంకెవరులేరేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఏకంగా ఒక ట్రాక్టర్ డ్రైవర్ మూడు ట్రాలీలను ట్రాక్టర్కు జోడించి దాన్ని రివర్స్ చేసి సులభంగా ఇంటి లోపలికి తీసుకువెళ్లి పార్క్ చేశాడు. అయితే ఇక ఈ వీడియో చూసి అటు నెటిజెన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. సాధన ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అని ఇక ఈ డ్రైవర్ చూపించాడు అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అని ఎంతోమంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: