పీరియడ్స్ టైం లో నొప్పి.. ఆ టాబ్లెట్ వేసుకొని బాలిక మృతి?
మరి కొంతమంది డెలివరీ కావలసిన సమయంలో.. ఆసుపత్రికి వెళ్లడం మానేసి.. ఇక యూట్యూబ్లో చూస్తూ డెలివరీ చేయడం ద్వారా ఇక ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. ఇలా సొంత వైద్యంతో ఎంతోమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న.. ఇవన్నీ చూస్తున్న జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులోకి చెందినదే. సాధారణంగా ఆడవారికి ప్రతినెల పీరియడ్స్ కావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఇలా పీరియడ్స్ వచ్చిన సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు.
ఇక ఇలా విపరీతంగా కడుపునొప్పి వచ్చిన సమయంలో డాక్టర్ను సంప్రదించి ఇక వైద్యుడు సూచన మేరకు మెడిసిన్స్ వాడటం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం స్నేహితుల సూచన పీరియడ్స్ నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయింది. యూకే లో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. లైలా ఖాన్ అనే పదహారేళ్ళ బాలిక పీరియడ్స్ నొప్పులు తట్టుకోలేక స్నేహితుల సూచనల మేరకు గర్భ నిరోధక మాత్రలు వేసుకుంది. దీంతో తలనొప్పి వాంతులతో ఇబ్బంది పడుతూ బాత్రూంలో కుప్పకూలింది. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు వైద్యులు. ఆపరేషన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి లైలా ప్రాణాలు విడిచింది.