టిప్ గా రూ.6 లక్షల ఇచ్చింది.. కానీ తర్వాత ఏమైందంటే?

praveen
ఇటీవల కాలంలో కావాల్సిన ఫుడ్ ను ఇంట్లో వండుకొని తినడం కంటే ఫ్యామిలీతో  కలిసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తినెందుకే జనాలు తెగ ఆసక్తి కనబరుస్తూ కనబరుస్తూ ఉంటారు. ఫ్యామిలీతో ఇలా అప్పుడప్పుడు సరదాగా బయటికి వెళ్తే ఇక ఆయన అనుభూతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఎంతో మంది జనాలు. అయితే ఇలా రెస్టారెంట్కు లేదా ఫైవ్ స్టార్ హోటల్కు వెళ్లే ఎంతోమంది కస్టమర్లకు ఒక విషయం బాగా అలవాటుగా మారిపోయింది.

 అదే టిప్ ఇవ్వడం. అయితే ఒకప్పుడు ఇక ఇలా హోటల్లో లేదా రెస్టారెంట్లలో పని చేసే సిబ్బంది.. అక్కడికి వచ్చిన కస్టమర్లను రిక్వెస్ట్ చేసి టిప్ అడిగేవారు. కానీ ఇప్పుడు హోటల్ సిబ్బంది టిప్ అడగకపోయినప్పటికీ ఏకంగా రెస్టారెంట్ కి వెళ్ళిన కస్టమర్లు పుట్టుకతోనే ధనవంతులేమో అన్నట్లుగా టిప్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే టిప్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పది రూపాయలు లేదంటే 20 రూపాయలు ఇస్తారు అని. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు అయితే 100 లేదంటే వేలల్లో కూడా టిప్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక కస్టమర్ మాత్రం వేళల్లో కాదు ఏకంగా లక్షల్లో టిప్ ఇచ్చింది. లక్షల్లో టిప్ ఇవ్వడమేంటి ఆ కస్టమర్కు ఏమైనా పిచ్చా.. అలా ఎవరైనా చేస్తారా అంటారా..
 పిచ్చి, వెర్రి కాదు పొరపాటున ఇలా జరిగిపోయింది. ఇలా ఆరు లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్ ఆ తర్వాత కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కానర్ అనే యువతి బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అయితే ఆమె సబ్ వే లో ఉన్న శాండ్విచ్ తిని టిప్ గా అనుకోకుండా ఆరు లక్షల ఇచ్చారు. అయితే టిప్ అమౌంట్ ఎంటర్ చేసే క్రమంలో ఆమె పొరపాటున తన ఫోన్ నెంబర్ చివరి ఆరు అంకెలు సమర్పించారు. బ్యాంక్ స్టేట్మెంట్ చూసిన తర్వాత కానీ ఆమెకు జరిగిన విషయం అర్థం కాలేదు. దీంతో తన డబ్బు రిఫండ్ చేయాలని ఆ సాబ్ వేతో పాటు బ్యాంకు ని రిక్వెస్ట్ చేయగా చివరికి వారు ఆమె డబ్బును తిరిగి ఇచ్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tip

సంబంధిత వార్తలు: