ఇండియన్ టాలెంట్‌ను అమెరికా చీప్‌గా కొనేస్తోందా?
కిషన్ ను తల్లిదండ్రులు మహేష్, సునీత ఇద్దరు పై చదువుల కోసం అమెరికా పంపారు. అక్కడ మహేష్ రాణించి అద్భుత యాప్ ని కనిపెట్టారు. ఈ యాప్ ద్వారా ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి అన్ని యాప్ ల నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు. వెంటనే 416 కోట్ల రూపాయలు వెచ్చించి అమెరికాలోని ఆటోమేటిక్ టెక్ దిగ్గజ సంస్థ ఈ యూప్ ను కొనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా కిషన్ కోటీశ్వరుడు అయిపోయాడు. భారతదేశంలో గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. హెపటైటిస్ బి కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ను కనుగొన్న భారత శాస్త్రవేత్తలను అమెరికా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఆ వ్యాక్సిన్ స్వాధీనం చేసుకుంది.
అదే సమయంలో అక్కడ పని చేసినటువంటి సైంటిస్టులకు కూడా భారీ జీతాలు ఇచ్చి అమెరికా కు తీసుకెళ్లి పోయింది. అక్కడ వారు చేయాల్సిన పని ఏమీ లేకుండా వేరే ప్రయోగాలు చేయకుండా కేవలం అమెరికా వాళ్ళు మాత్రమే ప్రయోగాలు చేసేలా ప్లాన్ చేసుకుంది. తద్వారా భారతదేశంలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి సైంటిస్టులు కూడా ఇక్కడ ప్రోత్సాహం లేక అమెరికా వెళ్లి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సైంటిస్ట్ లను భారత ప్రభుత్వం ఎంతో సాయం చేయాల్సిన అవసరం ఉంది.