వ్యవసాయం చేయబోతున్న.. పాకిస్తాన్ సైన్యం.. ఎందుకో తెలుసా?
అదే సమయంలో అక్కడి ప్రభుత్వం ఇక దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడం విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో రోజురోజుకు ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి రోజు భారం గాని మారిపోతుంది అని చెప్పాలి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో అక్కడికి ప్రభుత్వం ఉంది అంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఏకంగా సరిహద్దుల వద్ద శత్రు దేశాల నుంచి ఉన్న ముప్పును తరిమి కొడుతూ పహారా కాయాల్సిన సైనికులు ఇప్పుడు రైతులుగా మారబోతున్నారు.
ఈ క్రమం లోనే మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ సైన్యం వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. తీవ్రమైన ఆహార సంక్షోభం అశాంతి నుంచి బయట పడెందుకే.. ఇక సైన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ఈ క్రమం లోనే తొలి దశలో 1000 ఎకరాలలో పంట పండించ బోతుందట. పాకిస్తాన్ సైన్యం ఇక ఆ తర్వాత ఆ పంటను 41 వేల ఎకరాలకు విస్తరించి ఉన్నారట. ఇందుకు గాను పంజాబ్ ప్రభుత్వం కైబర్ ఫక్తున్వా ప్రావిన్స్ లో సైన్యానికి 45 వేల ఎకరాల భూమిని కేటాయించిందట. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.