టీవీ యాంకర్ గా మారబోతున్న మాజీ ప్రధాని.. షాక్ అవుతున్న జనం?
అదేంటి ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి పదవి లేకపోతే టీవీ యాంకర్ గా మారతారా.. పార్టీలో కీలక నేతగా పార్టీ విజయం కోసం పనిచేసే వ్యూహకర్తగా ఉంటారు. కానీ ఇలా టీవీ యాంకర్ గా మారడం ఏంటి వినడానికి కాస్త కొత్తగా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా.. ఇలా ఎవరు చేయరు అని గట్టిగా నమ్ముతున్నారు కదా. కానీ ఇక్కడ ఒక మాజీ ప్రధాని మాత్రం ఇదే చేయబోతున్నాడు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ టీవీ యాంకర్ గా మారబోతున్నాడు. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రధాని కాకముందు కూడా ఆయన ఇలాగే ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేశారు.
అయితే గతంలో ప్రధాన పదవికి రాజీనామా చేసి మళ్ళీ తన యాంకర్ వృత్తిలోకి బోరిస్ జాన్సన్ వస్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు బోరిస్ జాన్సన్ మరోసారి టీవీ యాంకర్ గా అవతారం ఎత్తబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. రష్యా నుంచి చైనా వరకు, ఉక్రెయిన్ యుద్ధం, రోజువారి సవాళ్లు, మన ముందున్న అవకాశాలు వంటి వాటిపై విశ్లేషణలు మీ ముందు ఉంచబోతున్నాను అంటూ బోరిస్ జాన్సన్ ఒక పోస్ట్ పెట్టారు. అయితే బోరిస్ జాన్సన్ మా ఛానల్ లోనే పనిచేయబోతున్నారు అంటూ జీబీ ఛానల్ కూడా ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం.