ఇక్కడ అమ్మాయిలను సరుకుల్లాగా నిల్చోబెట్టి.. కన్న తల్లిదండ్రులే అమ్మేస్తారు?
చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెల పెంపకంలో నిర్లక్ష్యం చేసినా వారికి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక నిర్దిష్ట వయసుకు రాగానే మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని తహతహలాడుతున్నారు. అయితే, ఒక చోట తల్లిదండ్రులు తమ అమ్మాయిలను బజారులో సరుకుల్లాగా అమ్మేస్తుంటారు అక్కడ ఇది ఒక ఆచారంగా కొనసాగుతుంటుంది. ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. మరో విస్తు పోయే విషయం ఏంటంటే, అన్న కూతుర్లను అమ్ముకునే ఈ ఆచారాన్ని వారు ఒక వార్షిక పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ ఏమిటి, ఎక్కడ జరుగుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
ఇది బల్గేరియాలోని స్టారా జగోరా సిటీలో బ్రైడ్ మార్కెట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది. ఇది కూరగాయల మార్కెట్‌ను పోలి ఉంటుంది, ఇక్కడ 16 నుండి 20 సంవత్సరాల వయస్సు గల బాలికలు కొనుగోలుదారుల కోసం ప్రదర్శించబడతారు. వారంతా కన్యలు అయి ఉండాలి. ఇక్కడ డేటింగ్ లేదా అమ్మాయి సమ్మతి వంటివేవీ ఉండవు. ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడితే, ఆమె తండ్రి డిమాండ్ చేసినంత మొత్తం చెల్లించాలి. కూరగాయలు కొనుగోలు చేసినట్లే ధరపై బేరాలు కూడా జరుగుతున్నాయి.
ఇది మనకు వింతగా, అనైతికంగా అనిపించవచ్చు, కానీ బల్గేరియాలోని కడైచి ప్రజలకు ఇది సాధారణ సంప్రదాయం. ఈ బ్రైడ్ మార్కెట్‌ను తమ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. ఈ కమ్యూనిటీ నుండి కొంతమంది అమ్మాయిలు మాత్రమే చదువుకుంటారు. వారు మాత్రమే వారి స్వంత భాగస్వాములను ఎంచుకుంటారు. వారు కూడా తమ భర్తను పెళ్లి చేసుకునేటప్పుడు తమ కుటుంబాలను ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక చాలా మంది మహిళలు ఎలాంటి విద్యను పొందడం లేదు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక కూలిపనులు చేసి డబ్బు సంపాదించి కూతుళ్ల కట్నం కోసం పొదుపు చేస్తారు. వీరికి విడాకులు కూడా ఉన్నాయి. వివిధ కారణాలతో విడిపోయి వేరొకరికి కట్నం ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
ఇలాంటి సంప్రదాయం తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. అమ్మాయిలు సంతలో మేకలా లేదంటే అమ్మడి సరుకులా? కేవలం డబ్బు కోసం ఎవరికి పడితే వారిని అమ్మాయిలను అమ్మేయడం ఎంతవరకు కరెక్ట్? కనీసం అమ్మాయి శ్రేయస్సు గురించి కూడా తల్లిదండ్రుల ఆలోచించరా అని చాలామంది తిట్టిపోస్తున్నారు.