కెనడా తీవ్రవాదుల స్వర్గంగా ఎందుకు మారింది?
అమెరికా భారత్ తో ఎటువంటి గొడవలు పడకూడదని అనుకుంటుంది. కానీ కెనడా తరపున కూడా మాట్లాడాలి కాబట్టి మధ్యస్థంగా ప్రవర్తిస్తుంది. నిజ్జర్ హత్య కేసు విషయంలో మీరు కూడా సహకరిస్తే బాగుంటుందని భారత్ తో చెప్తుందట అమెరికా. ఇప్పుడు అటు కెనడాకి అమెరికా యూరప్ దేశాలతో పాటు కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విషయంలో భారత ఉప ఖండానికి వచ్చేసరికి బంగ్లాదేశ్ భారత్ కు సపోర్ట్ గా ఉంటుంది.
భారత్ పద్ధతి గల దేశం, చాలా బాధ్యత గల దేశం, అలాంటి దేశం మీద అభాండాలు వేయొద్దు అని బంగ్లాదేశ్ అమెరికాకి చెప్పిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే శ్రీలంక కూడా భారత్ కు సపోర్ట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంలో భారత్‌పై నిరాధారమైన కెనడా ఆరోపణలపై భారత్ పక్షాన నిలుస్తుంది శ్రీలంక. తమిళ మారణహోమంలో భారత పాత్ర గురించి ఇప్పుడు ట్రూడో ఆరోపిస్తున్న భయంకరమైన అబద్ధాలను బట్టబయలు చేసింది శ్రీలంక.
శ్రీలంక విదేశాంగ మంత్రి అలిస్ అబ్రిస్ కెనడా తమిళ మైనారిటీపై మే 2019లో ముగిసిన అంతర్యుద్ధం లో భారత పాత్ర లేదని అన్నారు. ఒకవైపు మనతో పాటుగా అందరినీ ఇదేవిధంగా టార్గెట్ చేస్తూ ఉంటాడు కెనడా ప్రధాని. భారత్ జెనోసైడ్ చేసింది అంటే, చంపేసింది అంటూ కెనడా ప్రధాని చేసినటువంటి కామెంట్స్ పై మండిపడినటువంటి శ్రీలంక భారత్ బాధ్యత గల దేశం అంటూ సపోర్ట్ చేసిందట.