భారతీయుడు.. అమెరికా ప్రెసిడెంట్ కాబోతున్నాడా?
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో ఈయన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్లోరిడా గవర్నర్ డిసంటా తర్వాత స్థానాల్లో విక్రమ్ ఉన్నారు. ట్రంపు గైర్హాజరైన వివిధ సమావేశాల్లో ఈయన స్పీచ్ తో దూసుకుపోతున్నారని తెలుస్తోంది. అమెరికన్ పోల్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
తొలి సమావేశంలోనే రామస్వామి వివేక్ స్పీచ్ అందరినీ ఆకర్షించిందని వాషింగ్టన్ జర్నల్ ప్రచురించింది. ఇతరులు అందరూ తేలిపోయారంటూ న్యూ యార్క్ టైమ్స్ మ్యాగజైన్ తెలిపింది. ఇది రిపబ్లికన్ పార్టీ షోలా కాకుండా రామస్వామి వివేక్ షో లా కనిపించిందని ఎన్ బీసీ వార్తా సంస్థ చెప్పింది. చర్చ అనంతరం జరిగిన సమయంలో 28 శాతం మంది వివేక్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పగా.. 27 శాతం ప్లోరిడా గవర్నర్ స్పీచ్ అద్భుతంగా సాగిందని చెప్పారు.
అయితే రాబోయే కొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా భారతీయ సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కూడా దగ్గరలోనే ఉంది. ఒక వేళ ట్రంపు వయసు రీత్యా తాను కాదనుకుంటే మాత్రం ఉపాధ్యక్ష పదవి అయినా రామస్వామి వివేక్ కు దక్కేది. ఒక వేళ అమెరికా అధ్యక్ష పదవి దక్కితే మాత్రం రామస్వామి వివేక్ భారతీయ సంతతి నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన వైనం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఇండియా అంటే మరో సారి నిరూపితమవుతుంది.