బాబోయ్ పాము బ్రేక్ డాన్స్ చేయటం.. ఎప్పుడైనా చూసారా?
దీంతో ఇక ఎన్నో విషయాలను ఇంటి దగ్గర హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకుని మరీ తెలుసుకోగలుగుతున్నారు అందరూ. ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వార్తలు అయితే ఎక్కువగా నేటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. పాముల కదలికలను చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఇలా ఎన్నో వీడియోలు వైరల్ గా మారగా.. ఆ వీడియోలలో పాములను చూసి భయపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో పామును చూస్తే మాత్రం నవ్వాలా లేకపోతే ఆశ్చర్య పోవాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు పాములు దాడి చేయడం ఇలాంటి వీడియోలు చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక పాము ఏకంగా పాటలు వింటూ బ్రేక్ డాన్స్ చేస్తుంది. ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఒక రేడియో వద్దకు పాకుతూ వెళ్ళింది. పాము దగ్గర ఉన్న రేడియో నుంచి బ్రేక్ డాన్స్ మ్యూజిక్ రావడంతో పాము కూడా డాన్స్ చేయడం ప్రారంభించింది. ఇది చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.