గిన్నిస్ రికార్డు కోసం.. 7 రోజులు ఏడ్చాడు.. కానీ చివరికి?
ఎందుకంటే ఒకే విషయంపై ఎన్నో ఏళ్లపాటు కఠినమైన సాధన చేసిన తర్వాతనే వరల్డ్ రికార్డు సాధించేందుకు అవకాశం ఉంటుంది అని భావించేవారు. కానీ ఇటీవల కాలంలో చాలా మంది రోజు చేసే పనులనే కాస్త ప్రత్యేకంగా వినూత్నంగా ట్రై చేసి.. చివరికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే వరల్డ్ రికార్డు సాధించాలని ఆశపడ్డాడు. ఎందుకోసం ఏం చేయాలా అని ఆలోచించగా.. ఏడుస్తూ గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తే సరిపోతుంది కదా అని భావించాడు.
ఏడిస్తే గిన్నిస్ రికార్డు ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అయితే ఇతనిది సాధారణ ఏడుపు కాదు అదో టైప్. నైజీరియా కు చెందిన టెంపురే అనే వ్యక్తి గిన్నిస్ రికార్డు కోసం వరుసగా ఏడు రోజులు పాటు గుక్క పెట్టి ఏడ్చాడు. దీంతో అతని ముఖం కళ్ళు వాచిపోయాయి. తలనొప్పి, కంటినొప్పితో ఇబ్బంది పడ్డాడు. అంతేకాదు 45 నిమిషాల పాటు కంటి చూపును కూడా కోల్పోయాడు. అయితే అతనికి ఎలాంటి అవగాహన లేకపోవడంతో చివరికి వరల్డ్ రికార్డు కోసం అప్లై చేసుకోలేకపోయాడు. దీంతో ఏడు రోజుల పాటు ఏడ్చిన అతని కష్టం చివరికి వృధాగానే మిగిలిపోయింది. అయితే ఏడుపుతో గిన్నిస్ రికార్డు సృష్టించాలి అనుకున్న అతని ఆలోచన గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.