నిజంగా గ్రేట్ గురు.. 74 ఏళ్ళు సెలవు లేకుండా పనిచేసింది?

praveen
సాధారణంగా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పడుతూ ఉంటారు. ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు ఎంతగానో సంతోష పడిపోతూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రం ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వారాంతంలో రెండు రోజులు సెలవులు వచ్చినప్పటికీ సరిపోవు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఇక సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ సోమవారం ఆఫీసుకు వెళ్లాలంటే అడుగు ముందుకు కదలకపోయినా బాధతోనే ఆఫీసులో అడుగు పెడుతూ ఉంటారు.

 ఇటీవల కాలంలో ఆఫీసుకు వెళ్లి పని చేయాలి అనుకుంటున్న ఉద్యోగుల కంటే ఎలా ఆఫీస్కు డుమ్మా కొట్టాలి అని ఆలోచిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా ఏకంగా ఏళ్ల తరబడి పనిచేయడం అంటే సాధ్యమవుతుందా.. దాదాపు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అది అసాధ్యమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఫంక్షన్లు, పార్టీలు, పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ ఏదో ఒక రోజు తప్పకుండా సెలవు తీసుకోవాల్సిందే. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా సెలవు పెట్టకుండా ఉండలేము. అలాంటిది ఏళ్ల తరబడి సెలవు తీసుకోకుండా పనిచేయడం అంటే అసాధ్యమంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.

 ఒకటి రెండేళ్లు సెలవులు తీసుకోకుండా పనిచేయడం కాదు.. ఏకంగా 74 ఏళ్ల పాటు సెలవు తీసుకోకుండానే ప్రతిరోజు పనిచేసేది. అమెరికాలోని టెక్సాస్ కి చెందిన మెల్వా మెబాని అనే 90 ఏళ్ల భామ 74 ఏళ్లుగా ఒకే సంస్థలో పనిచేసే ఇటీవల రిటైర్ అయింది. అయితే ఆమె తన 16వ ఏటా టైలర్ అనే స్టోర్లో ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి 74 ఏళ్లపాటు ఆ స్టోర్ లో పనిచేసిన ఆమె ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు . తొలిత లిఫ్ట్ ఆపరేటర్ గా కంపెనీలో చేరిన మెస్బా.. ఆ తర్వాత కాస్మెటిక్, దుస్తుల విభాగంలో పనిచేశారు అని చెప్పాలి. 74 ఏళ్ళు సెలవు లేకుండా పనిచేయడం అంటే నిజంగా గ్రేట్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: