రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

Chakravarthi Kalyan
అమెరికాలో ఇటీవల రాహుల్ గాంధీ ట్రక్కులో తిరిగారు. అక్కడ ఉండి ఇండియాలో ఎక్కువగా ట్రక్కు డైవర్ లు మోసపోతున్నారని అన్నారు. తల్జీందర్ సింగ్ విక్కీ గిల్ అనే ట్రక్కు డ్రైవర్ రాహుల్ అక్కడ ప్రయాణం చేసి భారత్ లో ట్రక్కు, లారీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లారీ డ్రైవర్ల సమ్మె తీరుస్తామని అన్నారు.

అయితే ఈ తల్జీందర్ సింగ్ విక్కీ గిల్ అనే వ్యక్తి అమెరికా ఒవర్సీస్ కాంగ్రెస్ లో అధ్యక్షుడిగా చేస్తున్నట్లు తెలిసింది. రాహుల్ ట్రక్కులో ప్రయాణం చేయడం అనేది ప్రీ ప్లాన్ అని చెబుతున్నారు. విక్కీ గిల్ అనే వ్యక్తి గతంలో బీజేపీ లో ఉండేవాడని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. విక్కీ గిల్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తో కూడా పాల్గొన్నట్లు బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తాను కూడా సోషల్ మీడియాలో పోస్టును డిలీట్ చేశారు.

అమెరికాలో ట్రక్కు డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా వస్తాయని అదే ఇండియాలో జీతం చాలా తక్కువని అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రాహుల్ అమెథీ నియోజకవర్గంలో ఎంత మంచి రోడ్లు ఉన్నాయి. ఎంతమంది డ్రైవర్లకు మంచి మంచి జీతాలు ఇచ్చారు. అందుకేనా అమేథీని విడిచిపెట్టి కేరళలో పోటీ చేశారు. ఒక పక్క ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒవర్సీర్ యూత్ అధ్యక్షుడు ట్రక్కు డ్రైవర్ గా నడిపిస్తే అది ఎక్కి అమెరికాలో అలా ఉంది.

ఇండియాలో ఇంత ఘోరంగా తయారైందని విమర్శలు చేయడం కేవలం రాహుల్ గాంధీకే చెల్లిందని అంటున్నారు. రాహుల్ గాంధీ ఇలా పక్కా ప్లాన్ తో ఇలా చేయడం అనేది కేవలం రాజకీయంగా ఎదగడం కోసమేనని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.  ఇంతలా దిగజారి రాజకీయాలు చేయడం మాని ప్రజల అభివృద్ది కోసం పని చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: